తెలంగాణ

ఉపాధ్యాయ నియామకాలకు 22న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణలో ఉపాధ్యా య నియామకాలకు నోటిఫికేషన్ 22న వెలువడనుంది. సుమారు 9వేల పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అభ్యర్థి స్థానికత ఇబ్బంది కాకుండా కెసిఆర్ సర్కార్ వెసులు బాటు కల్పించింది. దీని ప్రకారం కొత్త లేదా పాత జిల్లాల్లో ఏదో ఒక దాంట్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు అభ్యర్ధులకు కల్పించనుంది. నోటిఫికేషన్ ప్రతిని తీసుకుని ఈ నెల 23న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు ఆమె న్యాయ స్థానం దృష్టికి తీసుకు రానున్నారు. టీచర్ల నియామకాలను సకాలంలో పూర్తి చేయనందుకు గతంలో తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు కనె్నర్ర చేసింది. ఈ నెల 23న స్వయంగా న్యాయస్థానం ముం దు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించిన విషయం పాఠకులకు విధితమే.
అందరికీ అవకాశం ఇవ్వాలి
జీవో 25ను సవరించి 45 శాతం పర్సంటేజీతో సంబం ధం లేకుండా బిఇడి, డిఇడి అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ 2017 డిఎస్సీలో అవకాశం కల్పించాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు భానోత్ వీరభద్రం, ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్, రాగిణీ కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 వరకూ ఎస్సీ, ఎస్టీలకు డిఇడి చేయడానికి ఇంటర్‌లో 40 శాతం కనీస మార్కులు గా నిర్ణయించారని, 2016, 2017లో తెలంగాణ టెట్‌లో పేపర్ -1 రాయడానికి కూడా 40 శాతం కనీస మార్కులుగా నిర్ణయించారని, తాజాగా ఇచ్చిన జీవో 25 ప్రకారం ఇంటర్‌లో 45 శాతం, డిగ్రీలో 50 శాతం మార్కులుండాలనే నిబంధన సరికాదని వారు పేర్కొన్నారు.దీనిని సవరించి అందరికీ అవకాశం కల్పించాలని వారు కోరారు.
ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా రోజారాణి
ఉస్మానియా యూనివర్శిటీ జెనిటిక్స్ విభాగం ప్రొఫెసర్ ఎ రోజా రాణి ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సికింద్రాబాద్ పిజి కాలేజీ ప్రిన్సిపాల్‌గా కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డి చెన్నప్ప నియమితులయ్యారు.
వచ్చే నెల 18న గీతం స్నాతకోత్సవం
గీతం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవం నవంబర్ 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ ప్రాంగణంలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందజేస్తామని అన్నారు. విద్యార్ధులు తమ డిగ్రీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.