తెలంగాణ

రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, అక్టోబర్ 20: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగుతందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామ రైతుల కోరిక మేరకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి అయకట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన కాల్వ ద్వారా కెఎల్‌ఐ కాల్వలో ప్రవహిస్తున్న కృష్ణమ్మకు జంగారెడ్డిపల్లి గ్రామ ప్రజలతో కలిసి గంగాపూజ చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతిగా పాలన కొనసాగిస్తున్నారన్నారు.
గత ప్రభుత్వాలు మాటలతో కాలయాపన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి కల్వకుర్తి ప్రజల 30 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కెఎల్‌ఐ సాగునీరుతో కల్వకుర్తి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి మండలంతో పాటు నియోజకవర్గంలో గల అన్ని మండలాలకు త్వరలోనే సాగునీరు అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాములు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు భూపతిరెడ్డి, సూర్యప్రకాష్‌రావు, జంగారెడ్డిపల్లి గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.