తెలంగాణ

ప్రాణం తీసిన చేపల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 20: సిరిసిల్ల పట్టణంలో ఈత సరదా ఒకవైపు, మరోవైపు చేపల కోసం గాలంతో దిగిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. స్థానిక శాంతినగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు గురువారం ఉదయం ఇంటి నుండి వెళ్ళి కనిపించకుండా పోయారు. శుక్రవారం ఉదయం సిరిసిల్లలోని కొత్త చెరువులో ఇద్దరి శవాలు నీటిలో తేలియాడుతూ కనిపించారు. దీపావళి పండుగ రోజున ఈ కుటుంబాలలో వీరి మరణం విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో మదాసు సాయిరాహుల్ (14), సయ్యద్ తాజ్(13) మృతి చెందారు. శాంతినగర్‌కు చెందిన మాదాసు సాయిరాహుల్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా, సయ్యద్ తాజ్ ఏడవ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటలకు తాజ్ తన స్నేహితుడైన సాయిరాహుల్ ఇంటికి వెళ్ళి తన సైకిల్‌ను అక్కడే ఉంచి బయటకు వెళ్తున్నట్టు చెప్పి పోయాడు. అనంతరం వీరి ఆచూకీ కనిపించలేదు. వీరి ఆచూకీ కోసం బందువులు, స్నేహితుల ఇళ్లల్లో గురువారం సాయంత్రం వరకు గాలింపులు జరిపినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం కొత్త చెరువులో సాయి రాహుల్ మృత దేహం నీటిలో తేలగా మరికొద్ది సేపటికి తాజ్ మృతదేహం తేలియాడింది. వీరిని బయటకు తీయగా తాజ్ చేతి లో చేపలు పట్టేందుకు ఉపయోగించే గాలం ఉంది. వీరి చెప్పులు, బట్టలు, చెరువు కట్టపైనే ఉంచి నీటిలోకి దిగినట్టు భావిస్తున్నారు. ఒకవైపు ఈత సరదా, మరో వైపు చేపలు పట్టాలనే కోరికతో నీటి లోకి దిగిన వీరు దీపావళి పర్వదినం రోజు పరలోకాలకు పయనం కావడంతో ఈ కుటుంబాలలో విషాదం అంతులేకుండా పోయింది. చిన్నారులు ఎవరికీ చెప్పకుండా చేపల వేటకు రావడంతో ఆచూకీ ఆలస్యంగా లభ్యమైంది. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.