తెలంగాణ

కాళేశ్వరం పనుల షెడ్‌వద్ద పేలిన డిటొనేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, అక్టోబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగం పనుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు డిటొనేటర్ పేలుడుకు తునాతునకలై మృత్యువాతకు గురైన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ శివారులో జరిగింది. కార్మికులు నివాస ప్రాంతమైన షెడ్ సమీపంలో పేలుడు సంభవించటం వల్ల మృతుని శరీర బాగాలు షెడ్‌పై ఇతర చోట్ల పడిపోయాయి. కాళ్లు మాత్ర మే మిగిలిన శరీర భాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పడి రక్తం చిమ్మింది. హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ శివారులో జరుగుతున్న కాళేశ్వరం సొరంగం పనుల కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. సుమారు 30 మంది వరకు ఉన్న కూలీలు సొరంగం సమీపాల్లో ఏర్పాటు చేసిన షెడ్స్‌లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రానికి బ్రాహ్మణికుంటి జిల్లా జరియా గ్రామానికి చెందిన వాల్టర్ కంగారి (25) అనే యువకుడు డిటెనేటర్ పేలి తునాతునకలై మృతిచెందాడు. మృతుని శరీర భాగాలు షెడ్ బయటి భాగంతో పాటు చుట్టు పక్కల పడిపోయాయి. గురువారం దీపావళీ పండుగ కావటంతో కార్మికులు విందు చేసుకున్నట్టు సమాచారం. నివాస ప్రాంతాల సమీపంలోనే మద్యం బాటిళ్లు పడి ఉండటం నిదర్శనంగా నిలుస్తున్నాయి. షెడ్స్‌లోనే సుమారు 30మంది వరకు కూలీలు ఉన్నా అందులో ఏ ఒక్కరికీ కూడా గాయాలైనట్టు ప్రకటించకపోవడం బట్టి చూస్తుంటే బ్లాస్టింగ్ ప్రమాదవశాత్తు జరిగిందా? తనకు తానే చేసుకున్నాడా.? ఎవరైనా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్లాస్టింగ్ విషయం పోలీసుల విచారణలో నిగ్గు తేలే అవకాశాలున్నాయి.
ఈ విషయంపై సైట్ ఇంజనీర్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిటొనేటర్ పేలిన ఘటనలో కార్మికుడు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట ఏసిపి నర్సింహరెడ్డి, తొగుట సిఐ వెంకటేశం, ఎస్‌ఐ రంగ కృష్ణ శక్రవారం ఉదయం హుటహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద విషయాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుని మృతదేహం తునాతునుకలు కావటం, మిగతా కార్మికులకు ఎవ్వరికీ ఏమీ కాకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు క్లూస్ టీం, డాగ్‌స్కాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు అక్కడికి రప్పించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ, పరిశీలన చేశారు.షెడ్స్ ప్రాంతంలో చెల్లా చెదురుగా పడిఉన్న కార్మికుని మృతదేహం భాగాలను ఏరి తెచ్చి వాటన్నింటినీ సమకూర్చి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.
సొరంగం పనుల్లో కార్మికుడు మృతిచెందలేదు
*నివాసం ఉండే షెడ్‌వద్ద ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి *ప్రాజెక్టు ఎస్‌ఇ ఆనంద్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 సొరంగం పనులు జరుగడం లేదని ప్రాజెక్టు ఎస్‌ఇ కెఎన్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తొగుట మండలంలోని తుక్కాపూర్ శివారులో గల ప్యాకేజీ -12లో పనిచేసే కార్మికుడు వాల్టర్ కంగారి ప్రమాదవశాత్తు తనకు తానుగా తాగిన మైకంలో పేల్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. కార్మికులు నివసించే షెడ్స్ వద్ద ఈ సంఘటన జరిగిందని సొరంగం పనుల్లో కాదన్నారు. మల్లన్నసాగర్‌కు పనులకు ఏమీ సంబంధం లేదని ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

చిత్రాలు.. డిటొనేటర్ పేలుడులో తునకలైన కార్మికుడి మృతదేహాన్ని కుప్పగా పోసిన దృశ్యం .
*పేలుడు సంభవించిన నివాస షెడ్డు ప్రాంతం, పక్కన పడి ఉన్న శరీర భాగాలు, మద్యం సీసాలు