తెలంగాణ

రైతులంటే కెసిఆర్‌కు చులకన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 22: రైతులు అంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చులకన భావమని, ఈ మహానుభావుడి పరిపాలనలో మూడున్నరేళ్లలో 3500 మంది రైతుల ఆత్మహత్యలకు కెసిఆరే కారణమని రైతు వ్యతిరేకి అయిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికీ సాగనంపే పని ఆసన్నమైందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల పరిధిలోని ఉడిత్యాల, నందారం గ్రామాల్లో అధిక వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, మొక్కజొన్న, వరి పంటలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టిపిసిసి ఉపాద్యక్షురాలు డికె అరుణ, మల్లురవి పరిశీలించారు. నందారం, ఉడిత్యాల, గుండేడ్ గ్రామాలకు సంబంధించిన పలువురు రైతులతో కాంగ్రెస్ నేతలు ముఖాముఖిగా మాట్లాడి పంటలను పరిశీలించి పంటదిగుబడిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నందారం గ్రామం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పట్టింపులేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి రైతులు కన్నీరు కారుస్తుంటే కెసిఆర్ మాత్రం మొద్దునిద్రలో ఉన్నారని ద్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు సాగుచేసిన రూ.48 లక్షల పత్తిపంటలో సగానికి పైగా నష్టం జరిగిందని, అదేవిధంగా 12 లక్షల హెక్టార్లలో సాగుచేసిన మొక్కజొన్న పంటకు గాను దాదాపు 30 శాతానికి పైగా నష్టపోయిందని, 15 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వరిపంటలో కూడా 25 శాతానికి పైగా నష్టం వాటిల్లిందన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు కన్నీరు కారుస్తూ అన్నమో రామచంద్రా ఉంటే కెసిఆర్ మాత్రం తన పరిపాలనలో పంటనష్టం జరిగిన అంచనాకు సంబంధించి గణాంకాలు చేపట్టకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పంటనష్టం లెక్కలు చేస్తే ప్రభుత్వం తరపున పరిహారం ఇవ్వాల్సి వస్తుందని భావించి అధికారులకు పంటనష్టంపై అంచనాలు వేయాలని కూడా ఆదేశాలు ఇవ్వలేదని ఆరోపించారు. కెసిఆర్ పరిపాలన రైతులకు శాపంగా మారిందని ఈయన మొద్దునిద్రతో వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. రైతులు అంటే దయలేదని కాంగ్రెస్ పార్టీ తరపున తాము కెసిఆర్‌ను డిమాండ్ చేస్తున్నామని, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాల్సిందేనని అన్నా రు. పత్తికి ఎకరాకు రూ.20వేలు, మొక్కజొన్నకు రూ.10 వేలు, వరికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు.
గత సంవత్సరం ఖరీఫ్‌లో అధిక వర్షాల కారణంగా రూ.15 వందల కోట్ల పంట నష్టం జరిగితే ఒక్కపైసా కూడా పరిహారం ఇవ్వలేదని, దీంతో కెసిఆర్ రైతు వ్యతిరేకిగా వ్యవహరించడానికి నిదర్శనమని అన్నారు.

చిత్రం..దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే డికె అరుణ