తెలంగాణ

28న బాబ్లీ గేట్ల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 22: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీసం సీజన్ చివరలోనైనా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశించగా, అలాంటి జాడలేవీ లేకుండానే వానాకాలం సీజన్ దాదాపుగా ముగిసిపోయింది. ఒకవేళ ప్రకృతి కరుణించి ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిసినా ఏమాత్రం ప్రయోజనం లేని దైన్యస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాకు ఎగువన గోదావరి నదికి అడ్డంగా మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల 28వ తేదీ నాటితో మూసుకుపోనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోనే ఈ బ్యారేజీని నిర్మించడం వల్ల ఏకధాటిగా వర్షాలు కురిసినా, వరద జలాల న్నీ బాబ్లీ సహా దానికి ఎగువన మహా సర్కా రు నిర్మించిన మరో 11 బ్యారేజీల వద్దే నిలిచిపోనున్నాయి. చుక్క నీరు కూడా దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరే అవకాశాలు మృగ్యంగా మారాయి. మళ్లీ వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే వరకు జూన్ 30వ తేదీ తరువాతే ఈ గేట్లు తెరువనున్నారు. వాస్తవానికి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, ఈ వివాదాల నడుమే యేటే టా శ్రీరాంసాగర్‌లోకి వరద జలాలు పోటెత్తుతూ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకోగలిగింది. ఎప్పుడైతే బాబ్లీ నిర్మాణం పూర్తయ్యిందో అప్పటి నుండే ఎస్సారెస్పీకి జలకళ తగ్గిపోయింది. ఈ పరిస్థితికి వర్షాభావం కూడా కారణంగా నిలిచింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి బాబ్లీ గేట్లు తెరిచి ఉంచినప్పటికీ, ఎస్సారెస్పీలోకి అరకొరగానే వరద జలాలు వచ్చి చేరాయి. 1091.00 అడుగులు, 90 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 55 టిఎంసిల వరకే నీటి నిల్వలు ఉన్నాయి. గత మూడు వారాల క్రితం వరకు కూడా ఎస్సారెస్పీలో కేవలం 27 టిఎంసిల వరకే నీటి నిల్వ లు ఉండగా, ఇటీవల మహారాష్టల్రో కురిసిన వర్షాల పుణ్యమా అని మరో 25 టిఎంసిల పైచిలుకు నీటి నిల్వలు వచ్చి చేరడం ఒకింత ఊరటనందించింది. మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో ఎగువ నుండి 68 టిఎంసిల వరకు ఇన్‌ఫ్లో రూపంలో వరద నీరు ఎస్సారెస్పీలోకి రాగా, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ద్వారా కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంకు 12 టిఎంసిలకు పైగా నీటిని అందించారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వలతో పాటు ఆయకట్టు పంటలకు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా మరికొంత మొత్తం నీటిని విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 55 టిఎంసిల వరకే నీటి నిల్వలు మిగిలాయి. రబీలో ఆయకట్టు పంటలకు నీరందించాలంటే కనీసం 60 టిఎంసిల వరకు నీటి నిల్వలు ఉండాల్సి ఉండగా, 5 టిఎంసిల మేర తక్కువగా ఉన్నాయి. అయితే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన సాగునీటిని విడుదల చేసే అవకాశాలు ఉండడంతో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ప్రస్తుత రబీ సీజన్‌లోనూ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీకి చెందిన ప్రధాన కాల్వలతో పాటు ఫ్లడ్‌ఫ్లో కెనా ల్ ద్వారా నీటి విడుదల జరుగడంతో దాని ప్రభావంతో వేలాది బోరుబావులు రీచార్జ్ అయ్యాయని భావిస్తున్నారు. కాగా, గతేడాదితో పోలిస్తే ఈసారి ఎస్సారెస్పీ సగం వరకే నీటి నిల్వలను సంతరించుకోవడం ఆయకట్టు రైతాంగానికి నిరాశకు గురిచే స్తోంది. ఇప్పటికిప్పుడు ఎస్సారెస్పీ పరీవాహక ప్రాం తంలో సమృద్ధిగా వర్షాలు కురిసినా, బాబ్లీ ప్రాజెక్టు గేట్లు 28వ తేదీన మూసివేయనుండడంతో వరద జలాలు దిగువకు ప్రవహించే మార్గం పూర్తిగా మూసుకుపోనుంది.