తెలంగాణ

ఎసిబి వలలో తిమింగలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 18: మంచిర్యాల ఐబి ఇరిగేషన్ శాఖలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఈఈ వినోద్‌కుమార్, డిప్యూటీ ఈఈ బాల సిద్దులను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే మిషన్ కాకతీయలో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఎంబి రికార్డులను పూర్తి చేసి నిర్మల్ పేఅండ్ అకౌంట్‌కు పంపించాల్సి ఉండగా, మూడు నెలలుగా పంపించకపోవడంతో అధికారుల చుట్టు ప్రదిక్షణలు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితుడు బెల్లంకొండ రవీందర్ రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. కరీంనగర్, ఆదిలాబాద్ ఎసిబి అధికారులు ఇరిగేషన్ శాఖ కార్యాలయంపై దాడి చేసి అవినీతి అధికారులను పట్టుకున్నారు. డిఎస్పీలు పాపాలాల్, సుదర్శన్ గౌడ్‌లు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలంలో మిషన్ కాకతీయ కింద జైపూర్ మండలంలోని దాంపూర్ ఊరచెరువు, పెగడపల్లి, ముదిగుంట, ఆరెపెల్లి, మద్దికల్ చెరువులకు మంథినికి చెందిన రవీందర్ రెడ్డి టెండర్లు వేసి రూ.80లక్షల పనులు దక్కించుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. పనులను పూర్తి చేసి మూడు మాసాలు గడుస్తున్నప్పటికీ మిగతా బిల్లులకు సంబంధించిన ఎంబి రికార్డులు చేయడం లేదు. ఈనెల 7న ఈఈ వినోద్ కుమార్‌ను కలసి తమ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు మీ టేబుల్‌పై ఉన్నప్పటికీ లేవని సమాధానం ఇవ్వడంతో మరోమారు కార్యాలయానికి కాంట్రాక్టరు వచ్చి రూ.40వేలు చెల్లించాడు. అదేవిధంగా డీఈ బాలసిద్దుకు రూ.60వేలు ఇవ్వడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లుగా వివరించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం ఎసిబి కోర్టులో వీరిని హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.