తెలంగాణ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య, కేంద్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ, ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, పార్టీ మాజీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు కృష్ణంరాజు, జీవిత తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ కార్యకర్త స్థాయి నుంచి లక్ష్మణ్ అధ్యక్షునిగా ఎదిగారని అన్నారు. అనుభవం గడించిన లక్ష్మణ సమర్థుడని, అటువంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు దక్కడం వల్ల పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు.