తెలంగాణ

అన్నదాతలకు అందని సూక్ష్మ సేద్య భాగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 18: కరవుతో తల్లడిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి సూక్ష్మ సేద్య పథకం సైతం అందకుండా పోతుండటంతో రైతన్నల కష్టనష్టలు మరింత అధికమవుతున్నాయి. గత రెండేళ్లుగా సూక్ష్మ నీటి పారుదల పథకం నిధుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం భారీగా కోతలు పెడుతుండటంతో అసలు డ్రిప్, స్ప్రింక్లర్ల రాయితీ పథకాలను అమలు చేస్తారో లేదోనన్న సందేహాలు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు సంబంధించి 75కోట్ల సూక్ష్మ నీటి పారుదల పథకం నిధుల మంజూరు పెండింగ్‌లో ఉండటం పథకం అమలులో అధ్వాన్న పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తుంది. 2104-15 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి 49కోట్ల 83లక్షలు కేటాయింపులు చేయగా కేవలం 17.64 కోట్లు మాత్రమే మంజూరు జరిగాయి. 2015-16సంవత్సరానికి 38కోట్ల రూపాయలు కేటాయింపులకుగాను ఇప్పటిదాకా 4.5కోట్లు మాత్రమే మంజూ రు కావడంతో సూక్ష్మ నీటిపారుదల పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న 10,475మంది రైతులు రాయితీ పరికరాల మంజూరుకు ఎదురుచూపులు పడుతున్నారు. అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి కూడా మరో10 కోట్లకు పైగా నిధులు మంజూ రు కావాల్సివుంది. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయకపోవడంతో డ్రిప్, స్ప్రింక్లర్ల కంపనీలు రైతులకు పరికరాలు పంపిణీ చేయడంలో విముఖత ప్రదర్శిస్తున్నాయి. కరువులో తక్కువ సాగునీరు, తక్కువ విద్యుత్‌తో ఆరుతడి, కూరగాయలు, పండ్ల తోటల సాగు చేసుకోదలిచిన రైతులు ఎక్కువగా డ్రిప్, స్ప్రింక్లర్లపై ఆధారపడుతున్నారు. ఒకవైపు వరుణుడు కరుణ లేక..ఇంకోవైపు సూక్ష్మ నీటిపారుదల పరికరాలు అందక పంటల సాగులో తాము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం గత సంవత్సరం 32కోట్ల పెండింగ్ నిధులతో పాటు ఈ సంవత్సరం 33కోట్లు, పాతా బకాయిలు మరో 10కోట్లకు పైగా మంజూరు చేయకలేక సూక్ష్మ సేద్యం పథకం అమలులో వెనుకడుగు వేస్తుండటం విమర్శలకు తావిస్తుంది.
తగ్గిపోతున్న సూక్ష్మ సేద్య విస్తీర్ణం!
జిల్లాలో సూక్ష్మ నీటిపారుదల పథ కం 2003నుండి ప్రారంభంకాగా ఇప్పటిదాకా 73వేల మంది రైతులకు 78వేల హెక్టార్ల మేరకు డ్రిప్, 9,070హెక్టార్లలో స్ప్రింకర్లను అందించి సూక్ష్మ సేద్యంతో పంటల సాగును ప్రోత్సహించారు. సూక్ష్మ నీటి పారుదల పథకం అమలు తొలినాళ్లలో బడా రైతులకే దక్కి దుర్వినియోగం జరిగిన క్రమంగా చిన్న, సన్నకారు, దళిత, గిరిజన రైతులకు బాసటగా నిలిచింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం, బిసిలకు, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీతో సూక్ష్మ నీటిపారుదల పరికరాలు మంజూరు చేస్తున్నారు. అయితే పథకం అమలులో లోటుపాట్ల నివారణకు ఒకసారి లబ్ధి పొందిన రైతుకు పదేళ్ల వరకు మరోసారి మంజూరీ అవకాశం లేకుండా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పిదప జిల్లాలో 2014-15ఆర్ధిక సంవత్సరంలో డ్రిప్(బిందు)సేద్యం పథకాన్ని 4,303 మంది రైతులకు సంబంధించి 4,998 మంది హెక్టార్లకు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని చివరకు 1,731 మంది రైతులకు చెందిన 1,827హెక్టార్లకే పరిమితమయ్యారు. స్ప్రింక్లర్ల సేద్యంలో 1,417మంది రైతులకు సంబంధించి 1,528హెక్టార్ల మంజూరు లక్ష్యంగా పెట్టుకుని 803మంది రైతులకు చెందిన 803హెక్టార్లకు మాత్రమే మంజూరి ఇచ్చారు. ఇక 2015-16సంవత్సరంలో బిందు సేద్యంలో 7,264మంది రైతుల నుండి, తుంపర సేద్యంలో 1,630మంది రైతుల నుండి దరఖాస్తులు అందాయి. ఇందులో బిందు సేద్యంలో 1,397 మందికి, తుంపర సేద్యంలో 239మంది రైతులకే మండల కమిటీలు దరఖాస్తులను ఆమోదించాయి.
ఈ ఆర్ధిక సంవత్సరంలో బిందు సేద్యంలో 2,316 మంది రైతులకు చెందిన 3,147హెక్టార్లు బిందు సేద్య విస్తరణ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 532మంది రైతులకు చెం దిన 659హెక్టార్లకు మంజూరు లభించింది. ఇక 597మంది రైతులకు చెందిన 1,110హెక్టార్లలో తుంపర సేద్య విస్తరణ లక్ష్యంగా పెట్టుకోగా నేటికి ఎలాంటి మంజూరీ లభించకపోవడంతో బిందు, తుంపర సేద్య రాయితీ పరికరాల కోసం జిల్లా రైతాంగం ఏడాదిగా ఎదురుచూపులు పడుతుంది.
రైతులకు అందని సూక్ష్మ నీటి పారుదల పథకం పరికరాలు