తెలంగాణ

మిషన్ కాకతీయలో కాంట్రాక్టర్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23:మిషన్ కాకతీయ పనుల్లో నిర్లక్ష్యం చూపిస్తున్న కాంట్రాక్టర్ సంస్థలను సస్పెండ్ చేసి, ఇతర సంస్థలకు పనులు అప్పగించాలని, నిర్లక్ష్యంగా ఉన్న ఇంజనీర్లకు మెమోలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌కె జోషి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు బదులు శనివారం జోషి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ పనుల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఇరిగేషన్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు సాగించని కాంట్రాక్టు సంస్థలను తక్షణం సస్పెండ్ చేసి కొత్త సంస్థలకు కేటాయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే ఇంజనీర్లను సహించేది లేదని, మెమో జారీ చేయనున్నట్టు చెప్పారు. మొదటి దశ పనులను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.