తెలంగాణ

కార్పొరేట్ కాలేజీలపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: కార్పొరేట్ కాలేజీలను నియంత్రించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం క్యాంపస్ వ్యవహారాలపై దృష్టిసారించింది. రెగ్యులర్ కాలేజీలు, డే స్కాలర్ కాలేజీలు, సెమి రెసిడెన్షియల్ కాలేజీలు, రెసిడెన్షియల్ కాలేజీలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీల్లో రెసిడెన్షియల్ విద్య నిర్వహించేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చి , ప్రభుత్వ నియమనిబంధనల మేరకు అవి పనిచేసేలా చూడాలని యోచిస్తోంది. ఇందుకు ఒక కమిటీని నియమించి తొలుత అధ్యయన నివేదిక తెప్పించుకోవాలని భావిస్తోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే కమిటీని నియమించి ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో 350కి పైగా జూనియర్ కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే దాదాపు 275 కాలేజీలు రెసిడెన్షియల్ విద్యను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు నుండి అనుబంధ గుర్తింపు పొంది రెగ్యులర్ కాలేజీలకు బదులు రెసిడెన్షియల్ కాలేజీలుగా నిర్వహిస్తున్న వాటిని మాత్రమే గుర్తించిన బోర్డు అధికారులు వారికి షోకాజ్‌లు ఇవ్వగలిగారు. మిగిలిన కాలేజీలు ఏ తరహా గుర్తింపు లేకపోవడంతో వాటిపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులకు ఎలాంటి అధికారాలు లేకపోవడం గమనార్హం. విద్యానగర్, శంకరమఠం , అమీర్‌పేట, నారాయణ గూడ, కోఠీ, దిల్‌షుక్‌నగర్, హయత్‌నగర్ , జూబ్లీహిల్స్ , తార్నాక వంటి ప్రాంతాల్లో కంప్యూటర్ కోర్సులు, జాతీయ ప్రవేశపరీక్షలు, వృత్తి ,సాంకేతిక విద్యా కోర్సులకు, బ్యాంకు , రైల్వే పరీక్షలకు, సివిల్ సర్వీసు పరీక్షలకు వేలాది శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో కొన్ని రెసిడెన్షియల్ కేంద్రాలు కూడా ఉన్నాయి. దాంతో కొత్త చట్టాన్ని తేవాలన్నా, ఉన్న విద్యాచట్టాన్ని సవరించాలన్నా కోచింగ్ కేంద్రాలకు అర్ధం , నియమనిబంధనలను రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే క్యాంపస్‌లో కాలేజీలు నిర్వహిస్తూ, కోచింగ్ కేంద్రాలను కూడా నిర్వహించవచ్చా, లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. కాలేజీలు, రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రాలను నిర్వహించే వీలుందా అనే దానిపై కూడా అధికారులు నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ అభిప్రాయాల మేరకు త్వరలోనే సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసి, అందుకు అవసరమైతే చట్ట సవరణ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కార్పొరేట్ కాలేజీల ఆగడాలపై తక్షణం చర్యలు తీసుకోవల్సిందేనని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీల దుశ్చర్యలపై ఇప్పటికైనా బోర్డు అధికారులు దృష్టిపెట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలను ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.