తెలంగాణ

జిఇఎస్ వేదికగా.. ఇవాంకతో ప్రధాని కీలక చర్చలు *విద్య, సంస్కృతి, రక్షణ, విదేశీ వ్యవహారాలపై చర్చ *సిద్ధమైన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాజధాని వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సదస్సు (జిఇఎస్-2017) మరో అత్యంత కీలక సమావేశానికి వేదిక కాబోతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సలహాదారు ఇవాంకతో కీలక చర్చలు జరపనున్నారు. ఇవాంక కొద్ది కాలంగా మహిళా పారిశ్రామికతను ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. గత జూలైలో జి-20 సదస్సు సందర్భంగా మహిళా పారిశ్రామికత ఆర్ధిక సాయం అనే అంశంపై ఆమె ఉపన్యసించడమేగాక, 50 మిలియన్ డాలర్ల ఆర్ధికసాయం కోసం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నచ్చచెప్పగలిగారు. ఈసారి హైదరాబాద్‌లో జరిగే సదస్సులో సైతం మహిళా పారిశ్రామికతపైనే ప్రధానంగా దృష్టిసారించారు. మహిళలను పారిశ్రామిక రంగంవైపు ప్రోత్సహించడం, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం, అవసరమైన ఆర్ధిక సాయం వారికి అందేలా ఆర్ధిక సంస్థలను చైతన్యపరచడం, నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చేలా మహిళలకు ప్రోత్సాహాన్ని అందించడం ప్రధాన అంశాలుగా సదస్సు జరగనుంది. ఇదే సందర్భంగా ఇవాంక అనేక మంది పారిశ్రామికవేత్తలతోనూ, భారతీయ అధికారులతోనూ భేటీ అవుతారు.
ప్రధాని విందు
చివరి వారంలో నవంబర్ 28 నుండి 30 వరకూ జరిగే ఈ సదస్సులో నవంబర్ 28న భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాంక గౌరవార్ధం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఫలక్‌నుమా ప్యాలస్ ముస్తాబవుతోంది. మరో పక్క ఇవాంకకు , ఆమె వెంట వచ్చే 10 మంది అధికారిక బృందం, 500 మంది పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రభుత్వం తరఫున హోటల్ గోల్కొండలో 29వ తేదీన విందు ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌లో అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యంత కీలక భేటీలో అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరుకావల్సిందిగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాంకకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందించడమేగాక, ఆగస్టులో మరో ఇవాంక రాక కోసం భారత్ ఎదురుచూస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. దానికి ఇవాంక సైతం తాను సైతం చాలా ఆసక్తిగా ఉన్నట్టు రీ ట్వీట్ చేశారు. ప్రధాని నిర్వహించే విందు సందర్భంగా ఇవాంకతో కీలక చర్చలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా విద్యారంగం, సాంస్కృతిక రంగం, రక్షణ రంగం, ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ఇందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వశాఖలు సన్నాహాలు చేస్తున్నాయి.
ముందే డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఇవాంక ట్రంప్‌తో భేటీ కంటే ముందే భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈస్టు ఏషియా సమ్మిట్ సందర్భంగా నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడితో ఈనెల 14న భేటీ కానున్నారు. వచ్చే ఏడాది డోనాల్డ్ ట్రంప్ భారత్ సందర్శనకు రానున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధికారుల స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాలు ఇప్పటికే ముగిశాయి. వాస్తవానికి నవంబర్‌లో జరిగే తూర్పు ఆసియా దేశాల పర్యటన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటించాల్సి ఉన్నా ఆ పర్యటనలో స్వల్ప మార్పు జరిగినట్టు చెబుతున్నారు.