తెలంగాణ

‘జర్నీ ఆఫ్ ది సిటీ పోలీస్’ ఆవిష్కరించిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన ‘జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్’ కాఫీ టెబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుశనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుండి నేటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని రంగుల (తైలవర్ణ) ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరచారు. నగరంలో గతంలో పోలీసులు గస్తీ తిరిగేందుకు సైకిళ్లను ఉపయోగించేవారు. ఆనాటి నుండి సిసి కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతున్న నేటి వరకు (సైకిల్ టు సైబర్) పోలీస్ వ్యవస్థ ప్రస్థానం, మార్పులను ఈ పుస్తకంలో క్షుణ్ణంగా వివరించారు. శాంతిభద్రతల కోణంలో హైదరాబాద్ నగర ప్రత్యేకతలు, పురాతన కాలంలో పోలీస్ వ్యవస్థ తీరుతెన్నుల గురించి రాశారు. కుతుబ్‌షాహీ కాలంలో కొత్వాల్ వ్యవస్థ, నిజాం కాలంలో నగర పోలీస్ వ్యవస్థ, భాగ్యనగరంలో హిందూ-ముస్లింలు కలిసి మెలిసి కొనసాగిస్తున్న జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. పోలీస్ వ్యవస్థలో ఉద్ధండులు, నగర పోలీసుల విధివిదానాలు , ట్రాఫిక్ నిర్వహణలో వచ్చిన మార్పులు, కొత్తమిలీనియంలో ఎదురైన పరిస్థితులను వివరించారు. నగరపోలీస్ కమిషనర్లుగా పనిచేసిన వారి వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని సమగ్రంగా, కూలంకషంగా తీర్చిదిద్దిన నూపుర్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కాఫీ టెబుల్ పుస్తకం నిర్వహణను అదనపు డిజిపి అంజనీకుమార్ పర్యవేక్షించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కొత్త డిజిపిగా నియమితులైన ఎం. మహేందర్‌రెడ్డి, హోంశాఖ సలహాదారుడిగా నియమితులైన అనురాగ్‌శర్మ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇద్దరు అధికారుల పనితీరును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
ప్రగతిభవన్‌లో అనురాగ్‌శర్మకు వీడ్కోలు
తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి డిజిపిగా పనిచేసి, ఆదివారం పదవీ విరమణ చేస్తున్న అనురాగ్‌శర్మకు మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ప్రభుత్వం తరఫున వీడ్కోలు సభ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

చిత్రం..‘జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్’ పుస్తకాన్ని శనివారం ప్రగతిభవన్‌లో విడుదల చేస్తున్న సీఎం