తెలంగాణ

గురుకులాల అభివృద్ధికి రూ. 12వేల కోట్లతో ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 11: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలను ఉన్నతీకరించి రానున్న మూడేళ్ళల్లో 12 వేల కోట్ల నిధులు ఖర్చుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ మైనార్టీ జూనియర్ కళాశాలను ప్రారంభించిన అనంతరం కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో అక్కడే ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యా సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకవచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, కాంగ్రెస్ హయాంలో 296 గురుకుల కళాశాలలుంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 544 గురుకుల పాఠశాలలను ప్రారంభించి నాణ్యమైన ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని స్పష్టం చేశారు. మైనార్టీ బాలుర, బాలికల పాఠశాలలు 206 ప్రారంభించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల కోసం మొత్తం 544 గురుకులాలు ప్రారంభించామని అన్నారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనానికి రూ.20 కోట్లు కేటాయించామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాలు ఏర్పాటు చేయగా వెనకబడిన మారుమూల మండలాల్లో టీచర్ల ఖాళీలను దృష్టిలో ఉంచుకొని పాత జిల్లాలు కాకుండా 31 జిల్లాల్లో డీఎస్సీ నిర్వహణకు ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నామని అన్నారు. కొందరు డీఎస్సీని అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నానరి, ఏదేమైనా కోర్టు తీర్పుకు శిరసావహించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని, ఎమ్మెల్యే కోనేరు కోనప్పను స్ఫూర్తిగా తీసుకొని సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుండి 24 గంటల కరెంట్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, మైనార్టీ, బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో విద్యా ప్రమాణాల నుంచి వారికి ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేస్తున్నామని అన్నారు. సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సామాజిక సేవా రంగంలో తనదైన ముద్రవేసుకొని రాష్ట్రంలోనే నంబర్‌వన్ ఎమ్మెల్యేగా ఎదిగారని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మైనార్టీ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సిర్పూర్‌టి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, కోనప్పలాంటి మనసున్న ఎమ్మెల్యే దొరకడం నియోజకవర్గ ప్రజల ఆదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్ప ట్రస్టు సేవలను కొనియాడుతూ వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు.