తెలంగాణ

చెత్తకుప్పలో జాతీయ జెండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, నవంబర్ 11: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద ఉన్న చెత్తకుప్పలో జాతీయజెండాలను పరేశారు. శనివారం గ్రామయువకులు కొందరు వాటిని శారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ, గ్రామపెద్దలకు సమాచారాన్ని అందించారు. దీంతో చెరువు వద్దకు వెళ్లి చెత్తకుప్పలో ఉన్న జాతీయజెండాలను పరిశీలించారు. అనంతరం వాటిని ఒకసంచిలో వేసుకుని పంచాయతీ కార్యాలయం లో ఉంచారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు కృష్ణయ్య మాట్లాడు తూ జాతీయజెండాలను పెద్దచెరువులో వేయడం సమంజసం కాదన్నారు. జెండాలను చెరువు వద్ద చెత్తకుప్పలో వేసిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈ సంఘటనపై ఎస్సై జములప్పకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మాట్లాడుతూ చెరువువద్ద చెత్తకుప్పలో వేసిన సంఘటనపై దర్యాప్తు చేసి వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చిత్రం..మరికల్ పెద్దచెరువు వద్ద చెత్తకుప్పలో వేసిన జాతీయజెండాలు