తెలంగాణ

1 నుండి రబీకి నిజాంసాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 11: నిజాంసాగర్ ఆయకట్టు కింద 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత రబీ సీజన్‌లో పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరు విడతలుగా చివరి ఆయకట్టు వరకు నీటి తడులు అందించనున్నారు. ఈ మేర కు శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణ యం తీసుకున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎ.రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల అధికారులు ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో పూర్తిస్థాయిలో 17.8 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండగా, తాగునీటి అవసరాలకు 1.2 టీఎంసీలు, ఆవిరి రూపంలో నష్టపోయే కొంత నీటిని మినహాయిస్తే పంటల సాగు కోసం 14 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ఇరిగేషన్ ఎస్.ఇ గంగాధర్ సభ దృష్టికి తెచ్చారు.
అయితే గతేడాది తరహాలోనే ఈసారి కూడా చివరి ఆయకట్టు వరకు 2.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించామని, ప్రస్తుతం నిజాంసాగర్‌లో అందుబాటులో ఉండే 14 టీఎంసీలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి మరో 3 టీఎంసీలను గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగించుకుని నిర్దేశిత ఆయకట్టుకు సంతృప్తికరంగా నీటిని అందిస్తామని మంత్రి పోచారం భరోసా కల్పించారు. ఈ విషయమై బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ స్పందిస్తూ, నిజామాబాద్ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా ఎస్సారెస్పీలో కనీసం 6 టీఎంసీల వరకు నీటిని అందుబాటులో ఉంచేలా ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. ముందుగా ఎస్సారెస్పీ నీటిని గుత్ప, అలీసాగర్ లిఫ్టుల ద్వారా వినియోగించుకున్న మీదటే, చివరి ఆయకట్టుకు నిజాంసాగర్ నీటిని మళ్లించేలా చూడాలన్నారు. దీనికి మంత్రి పోచారం సానుకూలంగా స్పందిస్తూ, ఈ మేరకు ప్రభుత్వానికి తీర్మానం రూపంలో నివేదిద్దామని సహచర ఎమ్మెల్యేలకు సూచించారు. రబీలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారని, అయితే పంటలు విత్తే విషయంలో ఏమాత్రం జాప్యానికి తావులేకుండా రైతులు సకాలంలో పంటల సాగు చేపట్టేలా చూడాల్సిన బాధ్య త అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని పోచారం పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసి రైతులు పం టలు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. గతేడాది రబీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో అకాల వర్షాల వల్ల రైతులు చేతికందిన పంటలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే నవంబర్ నెలాఖరు నాటికే రైతులు పంటలు విత్తుకునేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి మాసం చివరి నాటికి కోతలు పూర్తయిపోవాలన్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు సమన్వయ సమితి బాధ్యులతో పాటు సంబంధిత అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహించి రైతులను చైతన్యపర్చాల్సిన చర్యలు సూచిస్తామని అన్నారు. ప్రస్తుత రబీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారని, అన్ని జిల్లాలలో పంటలకు సమృద్ధిగా సాగు నీటిని అందించేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించనుందని అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ, రైతాంగ శ్రేయస్సుకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ముందస్తుగానే సాగునీటి ప్రణాళికలు రూపొందించామని, 24 గంటల విద్యుత్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. లేనిపక్షంలో ఏప్రిల్‌లో సంభవించి ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న సమయంలో బాధిత రైతులు నష్టపరిహారం పొందడం అగమ్యగోచరంగా మారిందని అన్నారు. కాగా, నీటి పారుదల సలహా మండలి సమావేశం కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ రాష్ట్ర నాయకుడు అమర్‌నాథ్‌బాబు ఆ పార్టీ ప్రతినిధు లు కలెక్టరేట్‌కు చేరుకుని ప్రగతిభవన్ ఎదుట కొద్దిసేపు నిరసన తెలిపారు. సింగూరు జలాలను ఎస్సారెస్పీ ద్వారా ఎల్‌ఎండీకి తరలించకుండా, జిల్లా ప్రయోజనాల కోసమే వినియోగించాలని కోరుతూ మంత్రి పోచారంకు, ఎంపీ కవితకు మెమోరాండంలు అందించారు.

చిత్రం..నీటి పారుదల సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం, ఎంపీ కవిత