తెలంగాణ

యాసంగికి సాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 12: నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతాంగానికి యాసంగి పంటల సాగుకు కృష్ణా సాగునీటి జలాలను ఎనిమిది విడతలుగా వారబందీ (ఆన్ ఆఫ్) పద్ధతిలో అందించేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహా లు చేస్తోంది. ఇప్పటికే సరైన వర్షాలు లేక, ఎగువ ప్రాం తం నుండి కూడా సకాలంలో వరదలు రాక సాగర్ ప్రాజెక్టుకు ఖరీఫ్‌లో నీటి కొరత ఏర్పడి ఆయకట్టు రైతాంగం ఖరీఫ్ పంటల సాగుకు నోచుకోలేదు. అయితే ఇటీవల శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు ఎగువ నుండి భారీగా వరదలు రావడంతో యాసంగి (రబీ సీజన్) పంటల సాగుకు ఎడమకాలువ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 3.80 లక్షల ఎకరాలకు డిసెంబర్ 1నుండి మార్చి 27వరకు 45 టీఎంసీల నీటిని వారబందీ పద్ధతిలో విడుదలకు ప్రభుత్వం నేడోరేపో ప్రకటన చేయనుంది. యాసంగి పం టలకు వారబందీ పద్ధతిలో నీటి విడుదలకు రంగం సిద్ధంకావడంతో ఆయకట్టులో రైతులు ముందస్తుగా వరినార్లు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆరుతడి పంటలకే సాగర్ నీటి విడుదల
సాగర్ ఎడమకాలువ ఆయకట్టులో యాసంగి ఆరుతడి పంటల సాగుకు 45 టీఎంసీల నీటిని డిసెంబర్ మొదటి వారం నుండి ఎనిమిది విడుతలుగా విడుదల చేయాలని ఎనె్నస్పీ అధికారులు ప్రభుత్వానికి నివేధించారు. నీటి విడుదల ఆరుతడి పంటల పేరుతో సాగినా రైతులు మాత్రం వరి సాగు చేయడం పరిపాటిగా మారింది. శ్రీశై లం, సాగర్‌లలో యాసంగి వరి సాగుకు కావాల్సిన నీరున్నప్పటికి వచ్చే సెప్టెంబర్ వరకు కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సాగర్ నీటిని పొదుపుగా వినియోగించే లక్ష్యంతో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. గత వేసవిలో సాగర్ ప్రాజెక్టుకు ఎదురైన నీటి ఎద్దడితో నల్లగొండ జిల్లాతో పాటు జంటనగరాలకు అందించాల్సిన తాగునీటికి కొరత ఏర్పడడంతో డెడ్‌స్టోరేజీకి దిగువన ముందెన్నడూ లేనిరీతిలో తాగునీటిని తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా సకాలంలో వరదలు రాకున్నా సాగర్‌లో తాగునీటి నిల్వల కొరత లేకుండా సాగర్ ఆయకట్టులో యాసంగికి ఆరుతడి పంటలకే నీరిచ్చేందుకు ఎనె్నస్పీ యంత్రాంగం మొగ్గుచూపింది. ఎడమకాలువ రైతుల యాసంగి పంటలకు తొలి విడతలో 12 రోజుల పాటు నీటి విడుదల కొనసాగించి మిగతా ఏడు విడతల్లో తొమ్మిది రోజుల పాటు నీటి విడుదల చేశాక వారం రోజులు సరఫరా నిలిపివేస్తారు. తొలి విడత డిసెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు, రెండో విడత 19న ండి 27 వరకు, మూడో విడత జనవరి 3నుండి 11 వరకు, నాల్గవ విడత 18 నుండి 26 వరకు ఐదోవిడత ఫిబ్రవరి 2 నుండి 10 వరకు, ఆరో విడత 17నుండి 25 వరకు, ఏడో విడత మార్చి 4 నుండి 12 వరకు, ఎనిమిదో విడత 19 నుండి 27 వరకు నీటి విడుదల చేస్తారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను 574.30 అడుగులుగా 312 టీఎంసీలకుగాను 267.30 టీఎంసీ లు నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 878.40 టీఎంసీలున్నాయి. గత ఏడాది సాగర్ ఎడమకాలువ కింద యాసంగి సీజన్‌లో 2.80 లక్షల ఎకరాలకు 38 టీఎంసీలను పలు విడతలుగా అందించారు. అప్పట్లో పంటలు చివరి దశలో ఉన్న సమయంలో ప్రత్యేకంగా ప్రభుత్వానికి, కృష్ణాబోర్డుకు విన్నపాలు చేసి సాగునీటి విడుదల కొనసాగించారు.
చిత్రం..నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎడమ కాలువ...ఆయకట్టులో యాసంగి సాగుకు సిద్ధం చేస్తున్న వరినారు (ఇన్‌సెట్‌లో)