తెలంగాణ

పర్ణశాలలు.. హోమ గుండాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 20: విశ్వశాంతి, రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ చండీమాత ప్రసన్నం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించతలపెట్టిన అయుత మహా చండీయాగం ప్రాంగణం మొత్తం చూడచక్కని పద్ధతుల్లో తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక ఏర్పాట్ల జోలికి వెళ్లకుండా సాధుసంతులకు ఇష్టమైన కుటీరాలను ఏర్పాటు చేసి వాటిల్లో బస కల్పించనున్నారు. జగద్గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు రాష్టప్రతి, పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వస్తుండగా వారందరికీ కుటీరాల్లోనే విడది ఏర్పాట్లు చేయనున్నారు. వెదురు బొంగులతో నిర్మించిన కుటీరాల పైకప్పులు సైతం వరిగడ్డితో ఏర్పాటు చేసి చక్కటి రంగులతో తీర్చిదిద్దారు. రామాయణంలో శ్రీరాముడు వనవాస సమయంలో భద్రాచలంలో సమీపంలో ఏర్పాటు చేసుకున్న పర్ణశాలను తలపించే విధంగా ఏర్పాటు చేసారు. వేద మంత్రాలు పఠించి యాగాన్ని పూర్తి చేయనున్న రుత్విజులకు రేకుల షెడ్డుతో నిర్మించిన ప్రాంగణంలో బసకల్పించనున్నారు. భోజనశాల, వంటశాలను సైతం ఎతె్తైన పద్ధతిలో రేకులతో పటిష్టవంతంగా నిర్మింపజేసారు. స్వాగత తోరణాలు, అమ్మవారి చిత్రాలతో కూడిన బ్యానర్లు, హోర్డింగులతో ఎర్రవల్లి మొత్తం మెరిసిపోతోంది. విఐపిల రాక దృష్ట్యా ఐదు హెలిప్యాడ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసారు. మర్కుఖ్ నుంచి ఎర్రవల్లి, గణేష్‌పల్లి నుంచి ఎర్రవల్లికి రెండు మార్గాలు ఉండగా ఈ రెండు మార్గాలను బిటి రోడ్డుగా విస్తరింపజేయడంతో భక్తులకు సౌకర్యవంతంగా మారింది. కారుచీకట్లను తొలగించే విధంగా భారీ స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసారు. ప్రధానంగా అయుత మహా చండీయాగం నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లలో పైకప్పు గడ్డితో తయారు చేయించి హైందవ సంప్రదాయానికి పెద్దపీట వేసారు. అయుత చండీయాగం నిర్వహించే ప్రదేశంలో చండీమాత ఆలయాన్ని నిర్మించడానికి సిఎం సంకల్పించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ చండీమాత ఆలయాన్ని నిర్మిస్తే పర్యాటక కేంద్రంగా ఎర్రవల్లి గ్రామానికి మంచిపేరు ప్రతిష్టలు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. 50 వేల మందికి సరిపోయే విధంగా అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేయడానికి పాకశాస్త్ర ప్రావీణ్యులను రప్పిస్తున్నారు. తాగునీటి వసతిని ఏర్పాటు చేయిస్తున్నారు. చండీయాగం విజయవంతం చేసేందుకు ప్రధానంగా పోలీసు శాఖ ఎక్కువగా శ్రమిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తనీయకుండా జిల్లా ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రత బలగాలతో మొత్తం 2500 మంది వరకు సిబ్బందిని బందోబస్తుకు ఉపయోగించనుండడం గమనార్హం. వాహనాల పార్కింగ్‌కు సైతం ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాగాన్ని సందర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటే ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేస్తామని మెదక్ రీజనల్ మేనేజర్ వేణు పేర్కొన్నారు. భక్తులకు వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు డిఎంహెచ్‌ఓ డాక్టర్ బాలాజీ పవార్ వెల్లడించారు. తిరునాళ్లను తలపించే విధంగా అయుత చండీయాగం వేడుకల్లో పాల్గొని తరించేందుకు భక్తులు ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు.