తెలంగాణ

అనురాగ్‌కు ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆదివారం పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనురాగ్ శర్మ 11 పోలీస్ బృందాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వీడ్కోలు పరేడ్‌లో కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపిఎస్, డిఐజీ, ఐజీ, సీఐడీ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనురాగ్ శర్మ సభలో ప్రసంగించారు. 35 ఏళ్ల సర్వీసు నుంచి డిపార్టుమెంట్‌ను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని ఆయన భాద్వేగంతో అన్నారు. 1992లో సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని, శాంతి భద్రతల పరిరక్షణలో నగర కమిషనర్‌గా ఎన్నో సవాళ్లు, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టెర్రరిజం, నక్సలిజం, సైబర్ నేరాల సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు పోలీసింగ్ చేశామని, ప్రజల సహకారంతో, ముఖ్యమంత్రి కల్పించిన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతను వినియోగించి సమస్యలను అధిగమించామన్నారు.
పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహకారం, హోంగార్డు మొదలుకొని డీజీ స్థాయి వరకు అందరూ అందించిన సహకారం మరువరానిదన్నారు. తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అనురాగ్ శర్మ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా సేవలందించిన అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. కాగా రిటైర్డ్ అయిన అనురాగ్ శర్మ పోలీస్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన జాయినింగ్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. తనపై విశ్వాసంతో పోలీస్ శాఖకు దూరం కావద్దనే ఉద్దేశంతో క్రైం కంట్రోల్ ప్రభుత్వ సలహాదారుగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.