తెలంగాణ

కానిస్టేబుళ్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,897 కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 907 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 2,990 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేస్తారని హోంశాఖ తెలిపింది.
భారీగా బదిలీలు
తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా బదిలీలు జరిగాయి. కొత్త డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులు కాగా, నగర కమిషనర్‌గా వి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. లాంగ్ స్టాండింగ్ ఐపిఎస్‌లతోపాటు ఎస్సైలు, ఏఏస్సైలు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న 258 ఎస్సైలు, 97 మంది ఏఎస్సైలు, 158 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం కల్పించేందుకు పోలీస్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్సైలకు అవకాశం కల్పించారు. గణేశ నిమజ్జనం అయిపోయాక ఈ బదిలీలు ఉంటాయని అందరూ భావించారు. అయితే ఇనె్స్పక్టర్ స్థాయి అధికారులకు స్థాన చలనం కలిగించడంతో ఎస్సైల బదిలీలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే బదిలీల ప్రక్రియ మొదలవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలావుండగా నగరంలో పనిచేస్తున్న కొంత మంది ఎస్సైలకు పదోన్నతి కల్పించేందుకు కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.