తెలంగాణ

జెట్ స్పీడ్‌తో సర్వే పనులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాకరంగా చేపట్టిన భూమి సర్వే పనులు 4వేల గ్రామాల్లో పూర్తయింది. మొత్తం 10806 గ్రామాల్లో భూమి రికార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు, భూ సర్వే పనులు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 15న బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి విదితమే. వచ్చే వారం రోజుల్లో 3వేల గ్రామాల్లో భూమిరికార్డులను పూర్తి స్ధాయిలో అప్‌డేట్ చేయనున్నారు. నవంబర్ 20వ తేదీలోపల మరో రెండు వేల గ్రామాల్లో భూమి సర్వే పనులు పూర్తికానున్నాయి. నవంబర్ 20వ తేదీ నాటికి 7 వేల గ్రామాల్లో భూమి సర్వే పనులు పూర్తవుతాయనే ఆశాభావంతో ప్రభుత్వ ఉంది. గ్రామాల్లో భూమి సర్వే పనులు పూర్తయిన పట్టణాలు, గ్రామాల్లో భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు పూర్తయిన భూమి రికార్డు పనుల నివేదికను ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 1.78 కోట్లకు పైగా సర్వే నంబర్లలో 2.45 కోట్ల ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఇంతవరకు దాదాపు కోటి ఎకరాల భూములను 1406 రెవెన్యూ బృందాలు సందర్శించాయి. ఇంతవరకు 78లక్షల సర్వే నంబర్లలో 1.4 కోట్ల ఎకరాల భూమిలో భూమి రికార్డుల పని పూర్తి కావడంతో, ఈ రికార్డులను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రం మొత్తం మీద జగిత్యాల, వరంగల్ జిల్లాలో గరిష్ట స్ధాయిలో 97 శాతం భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. రెండవ స్దానంలో మేడ్చెల్-మల్కాజగిరి, నల్లగొండ, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. మూడవ స్ధానంలో నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో 73 శాతం భూమి సర్వే పనులు పూర్తయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వనపర్తి, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో భూ సర్వే పనులు మందగమనంతో నడుస్తున్నాయి.