తెలంగాణ

బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: రాష్టస్థ్రాయిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకోసం కమిటీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర కార్మిక మంత్రి నాయని నిర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బాల కార్మిక నిర్మూలనపై సభ్యులు వేముల వీరేశం, దాస్యం వినయ్ భాస్కర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రెడ్‌క్రాస్, ఎన్‌జిఓలతో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లా మండల స్థాయిలో టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. బాలకార్మికులను హోటళ్లు, పరిశ్రమలు, దాబాల్లో గుర్తించామని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లో నేషనల్ చైల్డ్ సొసైటీలు ఏర్పాటు చేశామని అన్నారు. బాలకార్మికులకు వారి తల్లిదండ్రులకు కూడా కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 8874 మంది బాలకార్మికులను రక్షించామని, వారిని నియమించుకున్న యజమానులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. యజమానుల వద్ద కార్మికుడికి 20వేల చొప్పున వసూలు చేస్తున్నామని అన్నారు. వసూలు చేసిన డబ్బును బాలకార్మికుల సంక్షేమం కోసం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేస్తున్నామని అన్నారు. మూడున్నరేళ్లలో కలెక్టర్ల వద్ద 44 లక్షలు డిపాజిట్ చేశామని తెలిపారు. కనీస వేతనాల చట్టం కింద యజమానులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాయని పేర్కొన్నారు. 2016 బాలకార్మిక సవరణ చట్టం నిబంధల ప్రకారం రాష్ట్రంలో బాలకార్మికులను రక్షించి, పునరావాసం కల్పించేందుకు కార్మిక శాఖ ఎప్పటికపుడు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోందని అన్నారు. హానికర ప్రమాదకర ఉపాధిలో పనిచేస్తున్న బాలలను సదరు ఉద్యోగాల నుండి ఉపసంహరించి, వారిని ప్రభుత్వ హాస్టళ్లలోనూ, జాతీయ బాలకార్మిక ప్రాజెక్టుల శిక్షణ కేంద్రాల్లో చేరుస్తున్నామని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి జాతీయ కార్మికుల ప్రాజెక్టుల సమర్ధ నిర్వహణకు కార్మిక శాఖ వర్కుషాప్‌లను నిర్వహించిందని, బాలకార్మికులకు విద్య, నైపుణ్యాభివృద్ధి కల్పించే నిమిత్తం వారు జీవన స్రవంతిలోకి చేరే వరకూ కొత్తగా ఏర్పడిన జిల్లాలు అన్నింటిలోనూ జిల్లా ప్రాజెక్ట సొసైటీలు రిజిస్టర్ చేశామని చెప్పారు. 1988 దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశామని, 2014 నుండి 2016 వరకూ 1706 మంది బాలలను రక్షించామని వివరించారు.
కరీంనగర్ పట్టణానికి సరిపడా పోలీసు సిబ్బంది ఉన్నారని హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ట్రాఫిక్ స్టేషన్‌తో పాటు మొత్తం ఆరు స్టేషన్లు ఉన్నాయని వాటిలో 440 మంది సిబ్బంది ఉన్నారని అన్నారు.