తెలంగాణ

రాష్ట్రంలో 14 వెల్‌నెస్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దారులు, జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయం అందించేందుకు రాష్ట్రంలో 14 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పింఛను దారులు, జర్నలిస్టులు నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వెల్‌నెస్ సెంటర్లు ద్వారా ఎంతో మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ సెంటర్ల ద్వారా అన్ని రకాల వైద్య విధానాల్లో వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
పాతబస్తీలో సైతం వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రెండు మూడు రోజుల్లో సంగారెడ్డి, వరంగల్‌లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటవుతాయని, మరికొద్ది రోజుల్లో కూకట్‌పల్లి, నిజామాబాద్, సిద్దిపేటలో కూడా ఈ వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రద్దీ దృష్ట్యా రెండు సెంటర్లు త్వరలో ప్రారంభిస్తామని వివరిచారు. సిఇఓకు ప్రత్యేక కార్యాలయం , ప్రత్యేక సిబ్బందిని నియమించామని మంత్రి చెప్పారు. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్ ద్వారా 1,63,109 మంది, వనస్థలిపురం వెల్‌నెస్ సెంటర్ ద్వారా 77 వేల మంది వైద్య సేవలు పొందారని అన్నారు.