తెలంగాణ

ఆరోగ్యకరమైన పంటలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా పంటల ఉత్పత్తి జరిగేలా వ్యవసాయ శాస్తవ్రేత్తలు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజ్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ ఉత్పత్తుల’ ప్రదర్శనను తిలకించారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు లేడీ గవర్నర్ విమల కూడా ఈ ప్రదర్శనను తిలకించారు. వరి, తృణధాన్యాలు, కాయగూరలు, పూలు తదితర పంటల ఉత్పత్తులను ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ప్రదర్శనలో ఉంచారు. మనం ఇప్పటికే ఆహార పంటల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామని, ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు ఉపయోగించేలా శాస్తవ్రేత్తలు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.