తెలంగాణ

ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. భర్తీ చేసిన ఉద్యోగాలపై శే్వతపత్రం విడుదల చేయాలని, నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే యువతకు, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి చివరకు 16 వేలకు మించి ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగం అంశంపై స్వల్ప వ్యవథి ప్రశ్న కింద చర్చ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ యువతకు ఎందుకు భరోసా కల్పించడం లేదని, ఆపిల్ కంపెనీ బెంగళూరుకు ఎందుకెళ్ళిందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే 5,23,575 ఉద్యోగాలు వస్తాయని, 16 వేలకు మించి భర్తీ చేయలేదని, ఇందులో 11 వేలు పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని అన్నారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత పదవీ విరమణ చేసిన వారు 50 వేలకు పైగా ఉన్నారని ఆయన చెప్పారు. 4,372 పాఠశాలలు మూసి వేశారని, 23 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించలేదని విమర్శించారు. కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణకు బ్రేకు పడడంతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 13 యూనివర్సిటీల్లో 1001 ఖాళీలను భర్తీ చేస్తామన్నారు కానీ చేయలేదన్నారు. ఉస్మానియా వర్సిటీలో 542 పార్ట్‌టైం లెక్చరర్లు పని చేస్తున్నారని, వారినీ క్రమబద్ధీకరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత గంపెడాశతో ఎదురు చూశారని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదని, ఒక్క ఉద్యోగానికి 14 లక్షల మంది దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు.
మంత్రి టి. హరీశ్‌రావు కల్పించుకుని ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎన్నికలకు ముందు ప్రకటించలేదని, కావాలంటే ఎన్నికల ప్రణాళిక చూడాలని అన్నారు.
తిరిగి లక్ష్మణ్ మాట్లాడుతూ జివో 610 ప్రకారం 80 వేల ఉద్యోగాలు వస్తాయని అన్నారని చెప్పారు. 2015లో ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లన్నీ తప్పులేనని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, డిఎస్‌సి ప్రకటించకపోతే ప్రపంచం మునిగిపోతుందా? అని అన్నారని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కల్పించుకుని 4500 పాఠశాలలు మూసి వేసినట్లు లక్ష్మణ్ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎక్కడ మూసేశామో చెబితే బాగుంటుందన్నారు. తిరిగి లక్ష్మణ్ మాట్లాడుతూ వర్సిటీల్లో ఉన్న ఖాళీల వివరాలు చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదని, హెల్త్ కార్డులు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ చర్య ఓ స్ర్తి రేపు రా..అన్నట్లు ఉందని విమర్శించారు.