తెలంగాణ

ప్రజాప్రయోజనాల కోసమే అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర ఆర్ధిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ 22,485.06 కోట్లు రుణం తీసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పుల పరిమాణం 1.35 లక్షల కోట్లు ఉందని అన్నారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై పడే వడ్డీ భారం 8609.19 కోట్లు ఉందని మంత్రి ఈటెల చెప్పారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని అనడం తప్పు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నామని అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో పి జానారెడ్డి, తాటిపర్తి జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి, జి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుండి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతున్నాయి కనుక ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే రాష్ట్రాలు కానీ దేశం కాని అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధి జరగకపోతే, కరువులు ఆత్మహత్యలు అవే ఆకలి చావులు ఉంటాయి తప్ప ఏమీ జగరదని అన్నారు.
తెలంగాణ ప్రజలను ఈ దేశంలో గొప్ప పౌరులుగా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని తెలిపారు. అప్పులు ఇష్టారీతిన తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, బ్యాంకులు అడగ్గానే అప్పులు ఇవ్వడం జరగదని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడే అప్పులు ఇస్తాయని అన్నారు. రెవిన్యూ ఖర్చులు తక్కువ చేసిన వారికే అప్పులు ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. జిడిపిలో 41.11 శాతం అప్పులు చేసిన దేశం భారతదేశమని , ప్రపంచ దేశాల్లో అప్పులు చేసిన దేశంగా జపాన్ అగ్రస్థానంలో ఉందని, అమెరికా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని అన్నారు.