తెలంగాణ

కొత్త జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పాత జిల్లా కేందాల్లో ఇప్పటికే జిల్లా గ్రంథాయల సంస్థలు, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ 21 జిల్లాలకు కూడా ఈసౌకర్యం వర్తింపచేయాలని నిర్ణయించారు.
ప్రతి జిల్లాకు ఒక జిల్లా గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రస్తుతం ఆ యా జిల్లా కేంద్రాల్లో ఉన్న సాధారణ గ్రంథాలయాల స్థాయిని జిల్లా కేంద్ర గ్రంథాలయాలుగా మార్చాలని కీలకనిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ తయారు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అంటే ప్రతి జిల్లాలో ఒక జిల్లా గ్రంథాలయ సంస్థతో పాటు ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏర్పాటవుతాయి. వీటిలో పనిచేసేందుకు 189 పోస్టులను మంజూరు చేశారు. ఏటా రికరింగ్ ఖర్చు 324 లక్షల రూపాయలు (వేతనాలు ఇతర అలవెన్స్‌లు) అవుతుందని, ఈ ఖర్చును ప్రభుత్వం గాంట్-ఇన్-ఎయిడ్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. నాన్-రికరింగ్ వ్యయం అయిన భవనాల నిర్మాణం, వౌలికసదుపాయాల ఏర్పాటు, పుస్తకాల కొనుగోలు తదితర ఖర్చుల కోసం 1050 లక్షలు ఖర్చవుతాయని అంచనావేశారు. ఈ ఖర్చును గ్రంథాలయ సెస్ నుండి భరించాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నియోజకవర్గం అభివృద్ధి నిధుల విడుదల

రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇచ్చిన అధికారాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి నిధికింద వివిధ అభివృద్ధి పనులకోసం 2017-18 సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 75 లక్షల రూపాయలు, ఒక్కో ఎమ్మెల్యేకు 75 లక్షలు కేటాయించారు. ఈ మొత్తం 120 కోట్ల రూపాయలు అవుతోంది. ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేరుతో ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పంపించిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ నిధులను వ్యయం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.