తెలంగాణ

ఉసురు తీసిన ఈత సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 15: వన భోజనాలకు వెళ్లిన కుటుంబాల్లోని నలుగురు పిల్లలు ఈత సరదాతో కుంటలోకి దిగి మృతిచెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం కొత్తపేటలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌లోని సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన మూడు కుటుంబాలు, కొత్తపేటకు చెందిన మరో కుటుంబం కలిసి బుధవారం వన భోజనాలకు కొత్తపేటలోని ఈదులకుంట ప్రాంతానికి వెళ్లాయి. పెద్దవారంతా వంటలు చేసే పనిలో నిమగ్నమై ఉండగా, పిల్లలు పక్కనేవున్న కుంటలో స్నానం చేసి వస్తామని వెళ్లారు. మొదట ముగ్గురు పిల్లలు రంజాన్ (16), మొమీన్ (14), రసూల్ (13) ఈత కొట్టేందుకు కుంటలో దిగి మునిగిపోతుండగా, ఒడ్డునుంచి గమనించిన యాకూబ్ (16) వారిని కాపాడేందుకు కుంటలో దిగి నలుగురూ మృతిచెందారు. అయతే, ఇది గమనించని కుటుంబ సభ్యులు మధ్యాహ్నం వరకూ చూసుకోలేదు. భోజనాలు ముగించుకున్నా, అప్పటికీ పిల్లలు భోజనాలకు రాకపోవడంతో వారికోసం గాలించారు. ఈదులకుంటలో పిల్లల దుస్తులు కనిపించడంతో తమ పిల్లలు కుంటలో మునిగి చనిపోయినట్లు గుర్తించి భోరుమన్నారు. గ్రామస్థులు ఈ విషయాన్ని అత్మకూరు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో సాయంత్రం నలుగురు పిల్లల మృతదేహాలను కుంటనుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ముస్లిం మైనారిటీ కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు కుంటలో మునిగి మరణించిన విషయం తెలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

చిత్రం.. ఈదులకుంటలో మృతిచెందిన నలుగురు పిల్లల మృతదేహాలు