తెలంగాణ

రేషన్ షాపులను మూసే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 15: రేషన్ షాపుల ను మూసివేసే ప్రసక్తేలేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు అధికార పార్టీకి చెందిన సభ్యుల ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, పౌరసరఫరాల శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని వివరించారు. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.18.52కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 3వేల 25 కేసులు నమోదు చేశామని, ఇందులో 163 క్రిమినల్ కేసులు, పీడీ యాక్టు కింద 3 కేసులున్నట్లు వెల్లడించారు. రేషన్ డీలర్లకు కమీషన్‌ను పెంచే యోచన ఉందన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదిలాబాద్ జిల్లాకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. 2.43లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని వివరించారు. జైకా, ప్రాణహిత, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాలు, ప్రాజెక్టుల ద్వారా మరిన్ని ఎకరాలకు నీటిని అందించనున్నట్లు తెలిపారు. మరొకొత్త రైతుబజార్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట
హైదరాబాద్ నగరంలో పెరిగిపోయిన సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ఆధునిక పోలీసింగ్ విధానాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 177 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు హోం మంత్రి నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసింగ్ వ్యవస్థ ఎంతో బాగుపడిందని బిజెపి సభ్యుడు ఎన్. రాంచందర్‌రావు, టిఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
వ్యాధులను నిర్మూలిస్తాం
మహానగరంలో వ్యాధులు ప్రబులుతున్న విషయం వాస్తవమేనని, కానీ మరణాల రేటును తగ్గించగలిగామని మంత్రి లక్ష్మారెడ్డి సభలో వెల్లడించారు. వ్యాధులు రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరముందని, ఇందుకు ప్రతిపక్షాల నేతలు కూడా సహకరించాలని మంత్రి సూచించారు.
బిల్లులకు ఆమోదం
జిఎస్‌టి నుంచి పెట్రోలు, డీజిల్, మద్యాన్ని మినహాయిస్తూ బిల్లులో స్వల్పంగా సవరణ చేస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బిల్లును ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. మరో అబ్కారీ బిల్లును కూడా ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.

రైతు ఆత్మహత్యల్లో మనమే ముందున్నాం

హైదరాబాద్, నవంబర్ 15: రైతు ఆత్మహత్యల్లో దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఇప్పటి వరకు 3600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతు లు విపత్కర పరిస్థితుల్లో ఉంటే అసెంబ్లీలో రైతుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశించామని, ఇంతవరకు చర్చే లేదని అన్నారు. దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏపాటి చిత్తశుద్ది ఉందో స్పష్టమవుతుందని అన్నారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్షకులు కనె్నర్ర చేస్తే కెసిఆర్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సమస్యలపై నల్గొండ కలెక్టరేట్ వద్ద తమ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నవంబర్ 20న ఒక రోజు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఆయన దీక్షకు సంఘీభావంగా వెళ్తున్నామని అన్నారు.
నీళ్లు, నియామకాలు, నిధులు నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఏ ఒక్క దానిని అమలు చేయలేదని అన్నారు. నల్గొండ కలెక్టరేట్ వద్ద ఉదయం 10.30కి జరిగే దీక్షలు పెద్ద ఎత్తున తరలి రావాలని రమణ పిలుపునిచ్చారు.

‘సెర్ఫ్’ ఉద్యోగుల అరెస్టులను ఆపండి

సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్
హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 15: తమ గోడును ప్రజాస్వామ్య పద్ధతిలో వెలిబుచ్చుకునేందుకు యత్నిస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల అరెస్టులను వెంటనే నిలిపి వేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో గడుపుతున్న వారు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్ధించేందుకు ప్రయత్నించడం తప్పా? అని ఆయ న ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పధకంలో పనిచేస్తున్న వారిపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, మహిళలను రాత్రివేళ అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘అన్ని గ్రామాలనూ ఎర్రవెల్లిలా తీర్చిదిద్దాలి’
అన్ని గ్రామాలను ఎర్రవెల్లిలా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. జీఓ 174 ప్రకారం సెర్ఫ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలన్నారు.
‘పంచాయతీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి’
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణ య్య డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్ర త కల్పించకపోతే 40వేల మంది ఉద్యోగులతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.