తెలంగాణ

గీత కార్మికులకు పరిహారం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచినట్టు అబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ 2014 నుండి నేటి వరకూ రాష్ట్రంలో 1.69 కోట్ల ఈతచెట్లను నాటామని అన్నారు. మొక్కల పరిరక్షణ కోసం సొసైటీ , టిఎఫ్‌టి సభ్యుల ప్రమేయంతో చర్యలు చేపట్టామని , ఎన్‌ఆర్‌జిఇఎస్ ద్వారా నిఘా, పహరా చార్జీలను సమకూర్చామని అన్నారు. గతంలో లైసెన్స్‌లు మూడేళ్లకు ఇచ్చేవారని ఇపుడు దానిని ఐదేళ్లకు పెంచామని చెప్పారు. తన తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా, గీత కార్మిక వృత్తి నుండి వచ్చిన వాడిని కనుక అసెంబ్లీకి వచ్చి తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. డ్రిప్ ద్వారా ఈతచెట్ల పెంపకానికి ప్రయత్నించాలని, అలాగే చెట్లు ఎక్కేందుకు యంత్రాలను సమకూర్చాలని చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్ల కేటాయింపులో కల్లుగీత కార్మికులకు అవకాశం కల్పించాలని చెప్పారు.