తెలంగాణ

ఎస్సారెస్పీ నుంచి 6.10 లక్షల ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో 6.10 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో ఈ సాగునీటిని విడుదల చేయాలని, ఈ విషయమై నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించాలని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఉన్నతాధికారుల సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ కమిటీహాల్‌లో జరిగిన ఈసమావేశానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి ఎల్‌ఎండి ఎగువ వరకు 4లక్షల ఎకరాలకు, ఎల్‌ఎండి దిగువకు 1.60 లక్షల ఎకరాలకు సరస్వతి, లక్ష్మి కెనాల్స్‌కు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. వచ్చే మార్చి, నెలల్లో ఆయకట్టుకు ఎక్కువ సాగునీరు వచ్చే విధంగా ప్రణాళిక ఖరారు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం కృష్ణాలో ఎక్కువ నీళ్లు వచ్చాయని, గోదావరిలో తక్కువ వరద నీటి ప్రవాహం నమోదైందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పిలో ఈ ఏడాది 15 శాతం నీళ్లు తక్కువగా వచ్చాయన్నారు. ప్రస్తుతం 63 టిఎంసి నీళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. స్టేజి-1 టెయిల్ ఎండ్ వరకు నీళ్లు అందించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపరు. విఆర్‌వో, విఆర్‌ఏ సేవలను కూడా నీటి విడుదల పనులకు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయకట్టు చివరి రైతులకు నీళ్లు అందించేందుకు అవసరమైతే మూడు నెలల వ్యవధి కోసం కొంత మంది తాత్కాలిక ఉద్యోగులను పెట్టుకుందామన్నారు.