తెలంగాణ

ఈరోజు ఇంకొన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: నామమాత్రంగా కొన్ని కార్పొరేషన్లకు సోమవారం చైర్మన్‌లను నియమించనున్నట్టు తెలిసింది. మొత్తం 40కి పైగా కార్పొరేషన్లు ఉండగా, వీటిలో కొన్నింటికి సోమవారం నియామకాలు చేపట్టనున్నారు. గత ప్లీనరీ సమావేశం సందర్భంగానే నామినేటెడ్ పదవుల పంపకం చేపడతానని ప్రకటించి చేపట్టక వాయిదా వేస్తూ వస్తున్నందున ఈసారి ప్లీనరీ కన్నా ముందే పదవుల పందేరం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తొలుత పది మార్కెట్ కమిటీలకు చైర్మన్‌లను నియమించారు. దశల వారిగా మార్కెట్ కమిటీల నియామకం పూర్తి చేస్తారు. అదే విధంగా ఇప్పుడు సోమవారం నాలుగు కార్పొరేషన్ల చైర్మన్, ఇతర పాలక వర్గాలను నియమించనున్నారు. అనంతరం ప్లీనరీ తరువాత వరుసగా ఈ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఆ జిల్లాను మినహాయించి మిగిలిన జిల్లాలకు సంబంధించిన మార్కెట్ కమిటీలను నియమిస్తున్నారు. అదే విధంగా చైర్మన్ పదవుల నియామకంలో సైతం ఖమ్మం జిల్లాకు ఎన్నికల వల్ల స్థానం కల్పించడం లేదని తెలిసింది. ప్లీనరీ తరువాత ముఖ్యమంత్రి పార్టీ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, పదవుల పంపకంపై సైతం దృష్టిసారిస్తారని తెలిసింది.