తెలంగాణ

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, నవంబర్ 16: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు రైతుల నిండు ప్రాణా లు బలయ్యాయ. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌మద్దూర్ గ్రామం లో గురువారం ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వేలు రవీందర్‌రెడ్డి (35), మరెల్లి శ్రీశైలం (37) ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కోసం బయలుదేరారు.
రబీలో సాగు చేసే వరి పంటకు అవసరమైన నారు పోసుకోవడానికి సిద్ధం కాగా వ్యవసాయ పొలాల కోసం ఏర్పా టు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ పని చేయడం లేదు. ఈ విషయమై వారం రోజులుగా ట్రాన్స్‌కో అధికారులకు చెప్పినా పెడ చెవిన పెట్టారు. గత్యంతరం లేక తామే బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లైన్‌మెన్‌కు ఫోన్ చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయడానికి వెళుతున్నామని, సబ్ స్టేషన్ నుంచి 11 కెవి లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయించాలని కోరారు. కాసేపటికి ఫోన్ చేసిన లైన్‌మెన్ గంగారాం విద్యుత్ సరఫరా నిలిపివేయించానని, ప్రస్తుతం ఎల్‌సి (లైన్‌క్లియర్) ఉం దని తెలపడంతో ఇద్దరు రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో ఎడ్జ్ ఫీజును వేస్తుండగా ఒక్క సారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఎగిరి చెల్లాచెదురుగా కింద పడి విగత జీవులయ్యా రు. సంఘటన చోటుచేసుకున్న సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా చేరింది. పది గంటల తరువాత రైతులు పొలాలకు వెళుతూ శవాలుగా మారిన ఇద్దరు రైతుల ను చూసి సమాచారం చేరవేయడంతో ప్రజలు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. వారం రోజులుగా లైన్‌మెన్ గంగారాం, ఎఇ రాములుకు ఫోన్ చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయాలని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇద్దరు రైతుల మృతికి అధికారులే కారణమని కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సంఘటన స్థలంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించామని హత్నూర ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఎఇ రాములు, లైన్‌మెన్ గంగారాంపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.