తెలంగాణ

నివేదిక ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధానకార్యదర్శి ధనసిరి ప్రకాష్‌లు ఆరోపించారు. ఈనెల 15తో ఐదోసారి గడువు పెట్టారని, అది కూడా దాటిపోయిందని అన్నారు. ఎనిమిది నెలలు గడచినా నివేదిక ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. కమిటీ ఈ ఏడాది మార్చిలో తన పని ప్రారంభించిందని చెప్పారు.
విద్యాసంవత్సరం నుండే ఫీజుల నియంత్రణ అమలులోకి వస్తుందని తిరుపతిరావు కమిటీ పేర్కొందని, అలా చాలా సార్లు చెప్పినా విద్యాసంవత్సరం మొదలై , ఫీజుల నియంత్రణ అమలులోకి రాలేదని అన్నారు. విద్యాసంవత్సరం రెండొంతులు పూర్తయిందని అన్నారు. అయినా ఇంతవరకూ రిపోర్టు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం కమిటీలు వేసేది కాలయాపనకే అనేది రుజువు చేశారని అన్నారు. ఎనిమిది నెలల తర్వాత ఇపుడు పాఠశాలల ప్రత్యక్ష పరిశీలనకు వెళ్తున్నట్టు చెప్పడం విడ్డూరమని అన్నారు. పర్యవేక్షణకు తల్లిదండ్రుల ప్రతినిధులను అనుమతించకపోవడం అనుమానంగా ఉందని పేర్కొన్నారు. ఇంతటి అసాధారణ జాప్యం ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యాపారులకు ఎంతో మేలు చేస్తోందని అన్నారు. ఇంతటి అసాధారణ జాప్యం ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యాపారులకు ఎంతో మేలు చేస్తోందని అన్నారు. కనకు తిరుపతిరావు కమిటీ నివేదిక వెంటనే ప్రభుత్వానికి ఇచ్చి విద్యావ్యాపార నియంత్రణకు సహకరించాలని వారు కోరారు.