తెలంగాణ

ఎయిడెడ్ స్కూళ్లలో 3500 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో గురువారం నాడు ర్యాగ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎయిడెడ్ పాఠశాలలు 742 ఉన్నాయని, వాటిలో 1.23 లక్షల మంది చదువుతున్నారని డిప్యుటీ సిఎం చెప్పారు. ఈ పాఠశాలల్లో 7వేల పోస్టులు మంజూరు కాగా, వాటిలో 3500 మంది మాత్రమే పనిచేస్తున్నారని మరో 3500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, తానూ కలిసి ఈ ఖాళీల భర్తీపై చర్చించి, సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.