తెలంగాణ

10నుంచి ఎడమ కాల్వకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 17: నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు 40టిఎంసిల నీటి విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు నిం పింది. డిసెంబర్ 10నుండి ఆన్‌ఆఫ్(వారబందీ) పద్ధతిలో విడతల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించగా నీటి విడుదల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు నేడు మిర్యాలగూడలో ఆయకట్టు పరిధిలోని నల్లగొండ-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపిలు, రైతు సంఘాల నాయకులు భేటీ కానున్నారు. శుక్రవారం హైద్రాబాద్‌లో ఇరిగేషన్ మంత్రి టి.హరీష్‌రావు, ఆర్‌అండ్‌బి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎంపి లు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. వారబందీ పద్ధతిలో 40టిఎంసిల సాగర్ నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా సమావేశం లో నిర్ణయించారు. గత ఏడాది యాసం గి పంటకు వారబందీ పద్ధతిలో 36టిఎంసిల నీటిని వినియోగించగా ఒక టిఎంసికి 10,639ఎకరాల మేరకు పంటల సాగు జరిగిందని ఈ లెక్కన ఈ దఫా 40టిఎంసిలకు 4.50 లక్షల ఎకరాల మేరకు సాగవుతుందని మిగిలిన చివర విడత రెండున్నర లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలను ప్రొత్సహించాలని దీనిపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని మంత్రులు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అలాగే నీటి వృథా జరుగకుండా వారబందీ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుని కాల్వల వెంట అధికారులు తరచూ కాలినడకన పర్యటించి నీటి సరఫరా సక్రమంగా జరిగేట్లుగా చూడాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఎంపిలు గుత్తాసుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, ఉత్తమ్ పద్మావతి, వేముల వీరేశం, మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ విజయ్, రవీంద్రకుమార్, మదన్‌లాల్, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె. జోషి, ఈఎన్‌సి పి.మురళీధర్‌రావు, సాగర్ సిఈ సునీల్ పాల్గొన్నారు.
ఎఎమ్మార్పీ ప్రాజెక్టు కింద 2.51లక్షల
ఎకరాలకు 14.71 టిఎంసిలు!
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్న ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద 2.51లక్షల ఎకరాలకు 14.71 టిఎంసిల నీటిని యాసంగి పంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఈ మేర కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడు విడతలుగా రోజుకు 2,150 క్యూసెక్కుల నీటిని 66రోజుల పాటు విడుదల చేయాలని ఇందులో ఏఏమ్మార్పీ ఎత్తిపోతల పరిధిలోని చెరువు లు, కాలువల కింద ఉన్న 2లక్షల 15వేల ఎకరాలకు, సాగర్ లోలెవల్ కాల్వ కింద 36వేల 350ఎకరాలకు సాగుకు నీటిని విడుదల చేయాలని ప్రతిపాదించారు.