తెలంగాణ

బీసీ కార్పొరేషన్‌ను పటిష్ఠం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: బిసి ప్రజా ప్రతినిధులతో వచ్చే నెల 3వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. శుక్రవారం నాడు శాసనసభలో సున్నం రాజయ్య, టి ప్రకాష్ గౌడ్ , కె లక్ష్మణ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బిసిలేనని అన్నారు. 50 శాతానికి పైబడి ఉన్న బిసిల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి బిసిల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత మరొకటి ఉండబోదని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బిసిలలో కూడా కడు పేదరికంలో ఉన్న వారున్నారని పేర్కొన్నారు. బిసి కార్పొరేషన్‌కు ఇవ్వబోయే సర్వ సమగ్ర వివరాలతో డిసెంబర్ 3వ తేదీన బిసి శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు. ఆ రోజున బిసిల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలనుకుంటున్న కార్యక్రమాలు వాటి వివరాలు, బిసిలకు ఇంత వరకూ వెచ్చించిన నిధులు, అన్న అంశాలపై నివేదిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో బంగారు తెలంగాణకు బాటలు వేసుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవసరం లేదని చెప్పారు. ఎంబిసిల సంక్షేమం కోసం అమూల్యమైన సూచనలు చేయాలని సభ్యులకు ముఖ్యమంత్రి కేసిఆర్ సూచించారు.
వెయ్యికోట్లు : మంత్రి జోగు రామన్న
రాష్ట్రంలో ఎంబిసిలకు వెయ్యికోట్లు బడ్జెట్‌లో కేటాయించామని బిసి అభివృద్ధి మంత్రి జోగు రామన్న చెప్పారు. అత్యంత వెనుకబడిన వర్గాల కోసమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వాల నుండి వెనుకబడిన కులాలు లబ్ది పొందలేదని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎంబిసిలను గుర్తించేందుకు బిసి కమిషన్ పనిచేస్తోందని అన్నారు. ఇంత వరకూ అనేక సమావేశాలు నిర్వహించి బిసి కమిషన్ వివరాలు సేకరించిందని తెలిపారు. బిసి కమిషన్ నివేదికను సమర్పించిన వెంటనే ఎంబిసిలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
స్వాగతించిన బీసీ సంక్షేమ సంఘం
బిసిల అభివృద్ధిపై చర్చించేందుకు డిసెంబర్ 3న పార్టీలకతీతంగా బిసి ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు సిఎం అంగీకరించడం పట్ల తెలంగాణ బిసి సంక్షేమ సంఘం స్వాగతించింది. సిఎం ప్రకటన బిసిలకు కొంత ఊరట ఇచ్చిందని సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తాము అన్ని రాజకీయ పక్షాలను కలవడం, శాసనసభ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి తదితర కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఈ సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. బిసి ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని చెప్పడం పట్ల శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.