తెలంగాణ

గిరిజనుల అభివృద్ధికి ఏం కావాలో ప్రతిపాదనలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలో గిరిజనుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై ప్రతిపాదనలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 లక్షలకు పైగా గిరిజనులు ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువ మంది మారుమూల ఏజెన్సీల్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చబోతుందన్నారు. చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గూడేలు, తండాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని గిరిజనులు అర్థం చేసుకోవాలన్నారు. సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజనుల పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ? వాటికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి? ఇంకా ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమిటీ? వీటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. గిరిజన ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సమావేశమై ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రతిపాదనలతో ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం..గిరిజన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్