తెలంగాణ

ఈ-లెర్నింగ్ మాడ్యూల్‌తో వృత్తి నైపుణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వృతి నైపుణ్యత అనేది చాలా అవసరమని, దానికి ఈ-లెర్నింగ్ మోడ్యుల్స్ దోహదపడతాయని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) డైరక్టర్ జనరల్ బిపి ఆచార్య అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధిలో ఈ-లెర్నింగ్ అనేది ఒక పరికరంగా పని చేస్తుందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఎంసిహెచ్‌ఆర్‌డిలో జరిగిన కేంద్ర సర్వీసులు, సివిల్ సర్వీస్ అధికారుల 92వ ఫౌండేషన్ కోర్సులో ఈ-లెర్నింగ్ మోడ్యుల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్ట్ఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-లెర్నింగ్ అమలు చేయడంలో మిగిలిన రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందుందని, వివిధ స్థాయిల్లోని దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. 2018 మార్చి నాటికి 20 వేల మందికి ఈ-మోడ్యుల్స్‌లో శిక్షణ అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన కేంద్ర ఉపాధి, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ సివిల్ సర్వెంట్లకు నాయకత్వ లక్షణాలు అనేది చాలా అవసరమని, అది అవసరాన్ని బట్టి తమ శక్తి సామర్ధ్యాలను తెలియజేస్తుందని అన్నారు. ప్రజల అంచనాలు, అవసరాలను బట్టి సివిల్ సర్వీస్ ఉద్యోగులు పని చేసి మంచి పాలకులుగా పేరుతెచ్చుకోవాలని అన్నారు. 125 మంది అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు ఈ-లెర్నింగ్ ప్రోగ్రాం కింద సర్ట్ఫికెట్లను ప్రదానం చేశారు.