తెలంగాణ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 24: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న తాండూర్ డిపోకు చెందిన టిఎస్ 07ఎ 5288 ఎక్స్‌ప్రెస్ బస్సును వికారాబాద్ వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎపి 22 డబ్ల్యు 5243 టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు కాగా మరో 24 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఆర్టీసి బస్సులో సీట్లు నిండిపోగా, కొంత మంది ప్రయాణికులు నిలబడి ఉన్నారు. రాంగ్‌రూట్లో వచ్చిన టిప్పర్.. బస్సును బలంగా ఢీకొట్టింది. నవాబ్‌పేట మండలం మీనెపల్లికలాన్ గ్రామానికి చెందిన దస్తారెడ్డి(35), పూడూర్ మండలం కడ్మూర్ గ్రామానికి చెందిన జొన్నాడ మల్లయ్య(60) అక్కడిక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అమృతమ్మ(60), ధారూర్‌కు చెందిన చంద్రకళ(35), చేవెళ్లకు చెందిన వినోద(45), కమలమ్మ(45), హైదరాబాద్‌కు చెందిన మజర్(30), రయేసాబేగం(35)కు ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరిపి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అదేవిధంగా స్వల్పంగా గాయపడిన వెల్చాల్‌కు సయ్యద్ జాఫర్(60), ఆసిఫ్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మి(50), దామరగిద్దకు చెందిన లక్ష్మి(50), షాద్‌నగర్‌కు చెందిన నిరంజన్(28), చేవెళ్లకు చెందిన అనంతయ్య(48), స్వామి(35), లక్ష్మి(40), శ్రీనివాస్(9), కమలమ్మ(35), నిర్మల(36), పావని(10), పద్మమ్మ(40), సుమిత(25), యాదమ్మ(50), చందు(10), జస్వంత్(4), స్వప్న(30), బస్సు డ్రైవర్ శాణప్ప(40), జానప్ప(30), రాజు(20) ఉన్నారు. వీరిని వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు వికారాబాద్ పోలీసులు తెలిపారు.
chitram,,,
వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయన బస్సు, టిప్పర్