తెలంగాణ

ప్రజల సొమ్ముకు కేసీఆర్ పేరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తనకు అనేక నమ్మలేని నిజాలు కనిపించాయని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రోజూ సుమారు 4500 మంది రోగులు ఆసుపత్రికి వస్తుంటే, ఆసుపత్రిలో మాత్రం 2200 బెడ్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా వారిలో 1016 బెడ్స్‌పై ఉండే రోగులకే నిధులు విడుదల చేయడం జరుగుతున్నదని అన్నారు. రోగులు మందులను బయటే ఖరీదు చేయాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. శ్రీకాంత్‌కు జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరితే రూ.40 వేలు ఖర్చు అయ్యాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గాంధీ ఆసుపత్రిలో పెద్ద టవర్లు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోనే ముగ్గురు మరణించారని ఆయన తెలిపారు.