తెలంగాణ

కొత్త పంచాయతీరాజ్ చట్టం దేశానికే ఆదర్శంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పంచాయతీరాజ్ చట్టం దేశానికే ఆదర్శంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చట్టం రూపకల్పన కసరత్తు చేస్తున్న కమిటీతో మంత్రి జూపల్లి శనివారం సమీక్షించారు. ఇప్పటి వరకు చట్టంలో పొందుపర్చిన అంశాలు, చేర్చబోయేవి, తొలగించినవి తదితర వివరాలను కమిటీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా పాలనను కొత్త పుంతలు తొక్కించే విధంగా చట్టం తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే విదేశాలు, ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడ చట్టం గురించి అధ్యయనం చేసి తెలంగాణ చట్ట రూపకల్పన చేయాలని అన్నారు. అధిక జనానా ఉన్న గ్రామాల్లో వార్డుల సభ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని అన్నారు. ఈ చట్టం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలువాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ చెల్లప్ప, సభ్యులు నీతూకుమారి ప్రసాద్, రామారావు, వెస్లీ, సుథాకర్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
కూలీలను పరామర్శించిన మంత్రి జూపల్లి
టిప్పర్ ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి జూపల్లి శనివారం హాస్పిటల్‌కు వెళ్లి సందర్శించారు. సదరు కాంట్రాక్టర్‌తో చర్చించి కూలీలకు నష్టపరిహారం, రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పది లక్షల పరిహారంతో పాటు రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. గాయపడిన కూలీలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా కూలీలకు అండగా ఉంటుందని వెల్లడించారు.