తెలంగాణ

సంక్షేమ పథకాల పరిశీలనకు పీసీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై పరిశీలన చేసి పార్టీకి నివేదిక సమర్పించేందుకు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ తరఫున టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్సు చైర్మన్‌గా సంగారెడ్డికి చెందిన ఎస్. చంద్రశేఖర్‌ను నియమించారు. సభ్యులుగా మంచిర్యాలకు చెందిన బండి ప్రభాకర్ యాదవ్, నాగర్ కర్నూలుకు చెందిన మొర్రి గాలి యాదవ్, వనపర్తికి చెందిన రాజేంద్ర ప్రసాద్ యాదవ్, వరంగల్‌కు చెందిన శ్రీనివాసులును నియమించారు. వీరు బిసిలకు ప్రభుత్వం కేటాయించిన చేపలు, గొర్రెలు, బర్రెలు తదితర సంక్షేమ పథకాలపై సమాచారాన్ని సేకరించి టి.పిసిసికి అందజేస్తుంది.ఇలాఉండగా ఆదివారం (19న) మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు.