తెలంగాణ

టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్/కొల్లాపూర్, నవంబర్ 18: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటి దశలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలో చేపడుతున్న పనులలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. పనులు చేసేందుకు కాంట్రాక్టు కంపెనీ ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి టిప్పర్‌లో 15మంది వెళుతుండగా ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తాపడి ముగ్గురు చనిపోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజు మాదిరిగానే శనివారం ఉదయం 15మంది కూలీలు క్యాంపు నుంచి సొరంగం పనులు జరిగే ప్రదేశానికి ఎపి 22వి 5944 నెంబరుగల టిప్పర్‌లో వెళుతుండగా మార్గమధ్యంలో టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. దీనితో టిప్పర్‌లో ఉన్న వారందరికి గాయాలు కాగా, వెంటనే వారిలో కొందరిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరికి నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్‌లు డిఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌లాల్‌ను అప్రమత్తం చేసి నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఎక్కువ మంది వైద్యులు ఉండేలా చూడాలని ఆదేశించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న వైద్యులను రప్పించారు.
గాయాలకు గురైన 15 మందిలో నలుగురిని నేరుగా కొల్లాపూర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించగా, మిగతా 11 మందిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారికి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి ప్రైవేట్ ఆంబులెన్స్‌లో తరలించారు. వీరిలో ఒక్కరు మార్గమధ్యలోనే చనిపోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, మెదడుకు సంబందించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.్భరత్(30), సుశీల్‌పటేల్(25), త్రినాథ్(35) లు మృతి చెందారు. వీరంతా కూడా ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వారే. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో జయరాం, జెన్య, పద్మారాం, రాజ్‌కుమార్, రమణబాబు, షోజ్, జయద్, ముష్కర్, కురుమూర్తితోపాటు టిప్పర్ డ్రైవర్ మున్నాలు ఉన్నారు.