తెలంగాణ

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, నవంబర్ 18: ప్రజాసంక్షేమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆడపిల్ల పుట్టింది మొదలు, చదువు, పెళ్లి, విదేశీ చదువులకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా అత్యధికంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జహీరాబాద్‌లో ఇస్తున్నామన్నారు. రెండు సంక్షేమ పథకాలకింద 581 మంది లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికీ రూ.75,116 చొప్పున రూ.3,88,43, 312ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. శనివారం మంత్రి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించా రు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏసియన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లికోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం భార తదేశంలో ఎక్కడా లేదన్నారు. ముగ్గురు సంతానం ఉన్నా అందరికీ సహాయం అందించేందుకు సిఎం చర్యలు తీసుకున్నారన్నారు. కొన్ని సమస్యల కారణంగా పేద డపిల్లల తల్లి పేరున ఈ చెక్కును అం దించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గంకే ఎక్కువ మొత్తంలో చెక్కులు పంపిణీ చేశామన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటించిందన్నారు. అదేవిధంగా మైనార్టీ పిల్లల చదువులకోసం 206 ఇంగ్లీష్ మీడియం మైనార్టీ రెసిడెన్నియల్ పాఠశాలను ప్రారంభించామన్నారు. రుణాల విషయంలో బ్యాం కులనుంచి వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు అందించేందుకు సిఎం చర్యలు తీసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే మైనార్టీ విద్యార్థుల అమె రికా చదువులకు రూ.20లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రమాదంలో గాయపడి కాలు విరిగిపోయిన పట్టణానికి చెందిన పేద క్రికెటర్ వైద్యం కోసం సిఎం.అందించిన ఆర్థిక సహాయంతో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వెంటనే లక్ష, అనంతరం 4.5 లక్షలు అందించి, వైద్యులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదించామన్నారు.
పట్టణంలో జాతీయ రహదారి పొడవున డివైడర్లపై వెంటనే బటర్‌ఫ్లై ఎల్‌ఈడి లైట్లు వేయిస్తామన్నా రు. ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్దీన్ విజ్ఞప్తి మేరకు ఉర్దూ డిగ్రీ కళాశాలలో ఔటర్‌సోర్సింగ్ విధానం తీసేసి రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా నిమ్జ్‌లో కాలుష్య రహిత కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో అగ్రోప్రోస్‌తో జరిగిన చర్చల ఫలితంగా 750 ఎకరాల్లో రూ.750 కోట్లతో భారీ కర్మాగారం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారన్నారు. దీంతో 15వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వచ్చేనెలలో భారీమిషన్ల తయారీ పరిశ్రమతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. దాంట్లోకూడా సుమా రు 15వేల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. నిమ్జ్‌లో ఏర్పాటు కనున్న పరిశ్రమల్లో ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వారికి కావల్సిన విధంగా నైపుణ్యాన్ని ఇప్పించి ఉద్యోగాలివ్వండని పేర్కొన్నట్టు చెప్పారు. నిమ్జ్ అభివృద్ధికోసం కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి మ్యాపులు రూపొందించిందన్నారు. త్వరి తగతిన అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. బూచినెల్లి పారిశ్రామిక వాడలో ఆయిల్ ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ చేసుకున్నాయని, త్వరలోనే వారు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారన్నారు. దీంతో 5వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. రెండు పారిశ్రామికవాడల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వీఓ.లకు 5వేల జీతం ఇచ్చేలా సిఎం నిర్ణయి తీసుకున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకు లో వేయడం జరుగుతుందన్నారు.
మహిళల ఉసురు పోసుకోవద్దు
ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో అమలు చేసినవేనన్నారు. దళిత మహిళలపట్ల కొందరు ప్రతినిధుల తీరు మారాలన్నారు. లేకుంటే వారి ఉసురు తగులుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో చాలామటుకు ఎస్సీ, ఎస్టీలకు సక్రమంగా ఆర్థిక సహాయం అందడంలేదన్నారు. దీంతో నిధులు మిగిలిపోతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్, ఎంపి బిబి. పాటిల్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా, రైతు సంక్షేమ పథకాను కొనియాడారు. నియోజకవర్గం అభివృద్ధికోసం అవసరమైన అంశాలను మం త్రి దృష్టికి తీసుకుని పోయారు. ఈ సభలో మున్సిపల్ చైర్‌పర్సన్ షబానాతంజింబీ, జెసి.వెంకటేశ్వర్లు, సిడిసి చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, ఎఎంసి చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఎంపిపి.చిరంజీవి ప్రసాద్, జడ్పీటిసి సభ్యులు కిషన్‌పవార్, ఆర్డీఓ.అబ్దుల్ హమీద్, డిఎస్పీ నల్లమల రవి, నాయకులు నామరవికిరణ్, కిరణ్, సంజీవ్‌రెడ్డి, ఎండి.్ఫరీద్, అధికారులు, ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు