తెలంగాణ

ప్రకృతి తత్వాన్ని తెలిపేదే బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: ప్రకృతి తత్వాన్ని చాటుతూ జీవన విలువలను చాటేదే బతుకమ్మ అని నిజామాబాద్ ఎంపి కె.కవిత అన్నారు. బతుకమ్మ అంటే బతకడానికి ధైర్యాన్ని ఇచ్చే అమ్మ అని పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ ప్రాంగణంలో ఉన్న పీస్ ఆడిటోరియటంలో బతుకమ్మ స్ఫూర్తి ప్రచారాన్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను తెలిపే బతుకమ్మ పండుగను బ్రహ్మకుమారీలు తమదైన శైలిలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. సమాజంలో శాంతి, ప్రేమ, సహకారం వంటి విలువలను అలవర్చుకోవడం ద్వారా విలువలతో కూడిన సమాజాన్ని తయారు చేయవచ్చని అన్నారు. బ్రహ్మకుమారీలు నిస్వార్థంగా తమ సంస్థ ద్వారా సేవలందించడం అభినందనీయమని చెప్పారు. బ్రహ్మకుమారీలు ప్రారంభమై 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వౌంట్ అబూ నుంచి మొదలై దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి అతిధులు హాజరయ్యారు.

చిత్రం..ఆదివారం హైదరాబాద్‌లో బతుకమ్మ స్ఫూర్తి ప్రచారాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ కవిత