తెలంగాణ

డిసెంబర్ 1న వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులైన కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో డిసెంబర్ ఒకటిన వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. ఆదివారం నాడిక్కడ వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. డిసెంబర్ 1న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక ఉత్సవాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు అడివయ్య వెల్లడించారు. వికలాంగుల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, వారిని ప్రోత్సహించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.