తెలంగాణ

కేంద్రాన్ని నిందించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: స్ధానిక సంస్థలకు నిధులిచ్చే అంశంపై వాస్తవాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవద్దని పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సిఎం కెసిఆర్‌కు హితవు పలికారు. సీనియర్ రాజకీయ వేత్తగా కెసిఆర్ కొంచెం ఆలోచించి మాట్లాడాలని, వాస్తవాలను కాదని మాట్లాడ్డం మంచిది కాదని అన్నారు. ఈ మేరకు ఆయన సిఎంకు రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు చట్టబద్దంగా చెల్లించాల్సి వస్తున్న కేంద్ర వాటా సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ, రాష్టవ్రాటాగా చెల్లించాల్సిన నిధులను వెంటనే చెల్లించడం లేదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను బట్టి నిధులు చెల్లించడం జరుగుతోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా పన్నుల్లో నుంచి రాష్ట్రాలకు కేంద్రం అందజేసే వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రామపంచాయతీ అక్కౌంట్లకు నేరుగా నిధులను పంపిణీ చేస్తోందని, దీనిలో 90 శాతం బేసిక్ గ్రాంట్‌గా, మరో 10 శాతం ఫర్‌ఫార్మెన్స్ గ్రాంట్‌గా నేరుగా పంచాయతీలకే పంపించడం జరుగుతోందని అన్నారు. వాస్తవం ఇలా ఉంటే నిధుల విషయంలో కేంద్రాన్ని నిందించడం తగదని, రాష్ట్రం తరఫున స్ధానిక సంస్థలకు చెల్లించాల్సిన వాటాను విడుదల చేయాలని అన్నారు.