తెలంగాణ

గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు సీఎం అండదండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అండదండలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు విమర్శించారు. మియాపూర్ భూముల్లో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి సభను తప్పుదారి పట్టించారని ఆయన ఆదివారం పార్టీ నాయకుడు సుధాకర శర్మతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. మియాపూర్ భూములపై ముఖ్యమంత్రి ప్రకటన, కోర్టు తీర్పు, చట్టంలో ఉన్న నిబంధనలు వీటన్నింటితో గందరగోళ పరిస్థితికి దారి తీసిందని రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లను ఏకపక్షంగా రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు, సబ్-రిజిస్ట్రార్లకు లేదని కోర్టు ఇటీవల స్పష్టంగా చెప్పిందన్నారు.
మియాపూర్ భూముల్లో అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఎంపి కె. కేశవరావు కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లనూ రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏకపక్షంగా రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు, సబ్-రిజిస్ట్రార్లకు లేదని కోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కె. కేశవరావు కోర్టును ఆశ్రయించరా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో ‘ఈ భూములు ప్రభుత్వానివని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవు’ అని బోర్డు పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీని తప్పు దారి పట్టించినందుకన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే విషయమై తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. తప్పుదారి పట్టించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చిల్లర కళ్యాణ్ 80 గుంటల భూమిని కోర్టులో తనఖా (మార్టిగేజ్) చేసి రుణం పొందారని, ఆ తర్వాత తనఖా విడిపించుకునేప్పుడు 3,87,200 చదరపు అడుగులు (80 ఎకరాలు) అని రిజిస్ట్రేషన్ చేశారని ఆయన తెలిపారు. వేర్వేరుగా ఉన్న పహనీ పత్రాలను రఘునందన్ రావు మీడియాకు ఇచ్చారు.