తెలంగాణ

ఆడపిల్ల పుట్టిందని.. రెండో పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఉప్పల్, నవంబర్ 19: ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు మొదటి భార్యకు ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటని నిలదీసిన మొదటి భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఆ ప్రబుద్ధుడు. దీంతో న్యాయం కోసం మొదటి భార్య తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసముంటోన్న పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేస్తున్నాడు. చందానగర్‌కు చెందిన సంగీతను నాలుగేళ్ల క్రితం 2013లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరికి రెండేళ్ల క్రితం ఆడ పిల్ల పుట్టింది. అప్పటి నుంచి ఆడ పిల్ల పుట్టిందని తన భార్యను శ్రీనివాస్‌రెడ్డి తరచూ వేధించేవాడు. కాగా ఆదివారం శ్రీనివాస్ రెడ్డి మరొక యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇదేంటని ప్రశ్నించిన సంగీతను, ఆమె సోదరుడు రంజిత్‌ను దారుణంగా కొట్టి ఇంటి నుంచే గెంటేశాడు. తీవ్రంగా గాయపడిన సంగీత తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండేళ్ల తన కూతురు హబీబా, తల్లి పద్మ, సోదరుడు రంజీత్‌తో కలసి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త శ్రీనివాస్ రెడ్డి, అత్త, మామ ఐలమ్మ, బాల్‌రెడ్డి దాడి చేశారని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

చిత్రం..ఆందోళనకు దిగిన సంగీత